ETV Bharat / sports

చెలరేగిన బౌలర్లు.. భారత్‌కు భారీ ఆధిక్యం.. సిరీస్​ మనదేనా? - ఇంగ్లండ్ బెయిర్​ స్టో

Ind vs Eng Test Match: గతేడాది 2–1తో ఆగిపోయిన ఐదు టెస్టుల సిరీస్‌ 3–1తో తమ వశమయ్యే దిశగా భారత్‌ అడుగులేస్తోంది. ఇంగ్లండ్‌ బ్యాటర్లను భారత్​ క్రికెట్​ జట్టు బౌలర్లు కట్టడి చేయడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 300 పరుగుల్లోపే ఆలౌటైంది. దీంతో భారత్‌కు 132 పరుగుల ఆధిక్యం లభించగా, రెండో ఇన్నింగ్స్‌లో పుజారా అర్ధసెంచరీతో టీమ్​ఇండియా ఆధిక్యం 257 పరుగులకు చేరుకుంది.

INDIA VS ENGLAND 5TH TEST MATCH 2022
INDIA VS ENGLAND 5TH TEST MATCH 2022
author img

By

Published : Jul 4, 2022, 12:18 AM IST

Updated : Jul 4, 2022, 6:24 AM IST

  • 98/5.. తొలి రోజు టీమ్‌ఇండియాను ఇలా చూశాక అయిదో టెస్టులో ఆ జట్టు అవకాశాలపై చాలా మంది ఆశలు వదులుకునే ఉంటారు. కానీ జట్టు పుంజుకున్న తీరు అదరహో!
  • 132.. బ్యాటుతో అద్భుతంగా పుంజుకున్న భారత్‌.. బంతితోనూ విజృంభించి తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన ఆధిక్యమిది. మూడో రోజు బెయిర్‌స్టో శతక్కొట్టినా.. పేసర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్‌ను చుట్టేసిన బుమ్రా బృందం మ్యాచ్‌లో బలమైన స్థితిలో నిలిచింది.
  • 257.. మూడో రోజు ముగిసేసరికి మొత్తం ఆధిక్యమిది. అద్వితీయ పోరాటంతో ప్రతికూలతలన్నింటీ అధిగమించిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తోంది. 125/3తో నిలిచి విజయానికి బాటలు వేసుకుంది. చేతిలో ఏడు వికెట్లున్న టీమ్‌ఇండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంపై కన్నేసింది. ఇక మిగిలింది ఆఖరి పంచే. అయితే భారీ లక్ష్యాలను ఛేదించడం అలవాటు మార్చుకున్న ఇంగ్లాండ్‌కు ఎంత గట్టి సవాలు విసురుతుందన్నదే ఇక మ్యాచ్‌ గమనంలో ముఖ్యం. ఇప్పటికైతే టీమ్‌ఇండియానే స్పష్టమైన ఫేవరెట్‌.

Ind vs Eng Test Match: అయిదో టెస్టులో టీమ్‌ ఇండియా పట్టుబిగిస్తోంది. ఇక ఇంగ్లాండ్‌కే సవాల్‌. మొదటి ఇనింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. పుజారా (50 బ్యాటింగ్‌; 139 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు పంత్‌ (30 బ్యాటింగ్‌; 46 బంతుల్లో 4×4) క్రీజులో ఉన్నాడు. ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 84/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌.. 284 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (106; 140 బంతుల్లో 14×4, 2×6) సెంచరీతో ఆ జట్టును ఆదుకున్నాడు. ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 3 వికెట్లు, షమి రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. నాలుగో రెండు సెషన్లయినా ఆడితే మ్యాచ్‌లో భారత్‌కు తిరుగుండదు.

INDIA VS ENGLAND 5TH TEST MATCH 2022
సిరాజ్​

నిలిచిన పుజారా: మొత్తం ఆధిక్యంతో టీమ్‌ ఇండియా మెరుగ్గానే కనిపిస్తున్నా.. రెండో ఇనింగ్స్‌లోనూ ఆరంభం బాగాలేదు. అయితే పుజారా ఓ వైపు బలంగా నిలబడ్డాడు. ఉత్సాహంగా ఇన్నింగ్స్‌ మొదలెట్టిన భారత్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. మూడో బంతికే ఓపెనర్‌ గిల్‌ (4) ఔట్‌. అతడు మరోసారి అండర్సన్‌కు దొరికిపోయాడు. ఎక్స్‌ట్రా బౌన్సయిన బంతిని ఆడబోయిన అతడు స్లిప్స్‌లో క్రాలీకి చిక్కాడు. పుజారాతో కలిసి విహారి (11) వెంటనే మరో వికెట్‌ పడనివ్వలేదు. కానీ పరుగులే కష్టంగా వచ్చాయి. 16 ఓవర్లకు స్కోరు 43/1. అప్పటికి పుజారా 53 బంతుల్లో 22, విహారి 41 బంతుల్లో 11 చేశారు. అయితే తర్వాతి ఓవర్లోనే, బ్రాడ్‌ బౌలింగ్‌లో విహారి వెనుదిరిగాడు. అయితే దూకుడు కొరవడినా.. క్రీజులో పాతుకుపోయిన పుజారా పట్టుదలగా బ్యాటింగ్‌ను కొనసాగించాడు. మరోవైపు విహారి స్థానంలో వచ్చిన కోహ్లి (20; 40 బంతుల్లో 4×4) స్కోరు బోర్డుకు కాస్త వేగాన్నిచ్చాడు. కొన్ని చక్కని డ్రైవ్‌లతో అలరించాడు. ఓ దశలో 72/2తో భారత్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్నట్లునిపించింది. కానీ అప్పుడే స్టోక్స్‌ దెబ్బతీశాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌ కోహ్లీని బోల్తా కొట్టించింది. ఫార్వర్డ్‌ డిఫెన్స్‌ ఆడబోయిన కోహ్లి క్యాచ్‌ ఔటయ్యాడు. తేలికైన క్యాచ్‌ను వికెట్‌కీపర్‌ బిల్లింగ్స్‌ ఒడిసిపట్టలేకపోయాడు. కానీ తొలి స్లిప్‌లో అప్రమత్తంగా ఉన్న రూట్‌.. అతడి గ్లోవ్స్‌ నుంచి వచ్చిన బంతిని అందుకున్నాడు. ఆ తర్వాత పుజారాతో జత కలిసిన పంత్‌ మరో వికెట్‌ పడనివ్వలేదు. చక్కని షాట్లు ఆడాడు. ఇద్దరూ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు.

బెయిర్‌స్టో శతక్కొట్టినా..: సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ బెయిర్‌స్టో సెంచరీ కొట్టినా.. భారత్‌ భారీ ఆధిక్యాన్నే సాధించగలిగింది. 84/5తో రెండో రోజును కొనసాగించిన ఇంగ్లాండ్‌ మరో 200 జోడించిందంటే.. నష్టాన్ని కాస్త తగ్గించుకున్నట్లే. కానీ అదే సమయంలో భారత బౌలర్లు ఆ జట్టుకు పూర్తిగా కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చక్కని బౌలింగ్‌తో ప్రత్యర్థికి కళ్లెం వేసి టీమ్‌ఇండియాను బలమైన స్థితిలో నిలిపారు. శార్దూల్‌, షమి విలువైన వికెట్లు అందిస్తే.. సిరాజ్‌ లోయరార్డర్‌ పని పట్టాడు. 200/6.. లంచ్‌ సమయానికి ఇంగ్లాండ్‌ స్కోరిది. తన జట్టును గట్టెక్కించాలనే పట్టుదలతో కనిపించిన బెయిర్‌స్టో.. ఆరంభంలో కాసేపు ఇబ్బందిపడ్డా క్రమంగా పుంజుకున్నాడు. కోహ్లి స్లెడ్జింగ్‌ అతణ్ని రెచ్చగొట్టింది. గేర్‌ మార్చి దూకుడు పెంచిన అతడు తనదైన శైలిలో చకచకా బౌండరీలు బాదాడు. మరోవైపు స్టోక్స్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. బుమ్రా ఎటాకింగ్‌ ఫీల్డ్‌ పెట్టడంతో 33 నుంచి 36 ఓవర్ల మధ్య ఏడు బౌండరీలు వచ్చాయి. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్‌ (25) ఇచ్చిన క్యాచ్‌ను శార్దూల్‌ వదిలేయడంతో భారత్‌ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమో అనిపించింది. కానీ శార్దూల్‌ తన తప్పును తానే సరిదిద్దుకుని ఆ ముప్పును తప్పించాడు. కాసేపటికే స్టోక్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా మూడో రోజు భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు.

INDIA VS ENGLAND 5TH TEST MATCH 2022
బెయిర్​ స్టో

కెప్టెన్‌ బుమ్రా డైవ్‌ చేస్తూ అందుకున్న చక్కని క్యాచ్‌కు స్టోక్స్‌ నిష్క్రమించాడు. అయితే బిల్లింగ్స్‌ (36) అండగా నిలవగా బెయిర్‌స్టో మాత్రం మెరుపు బ్యాటింగ్‌ను కొనసాగించాడు. తరచుగా బంతిని బౌండరీ దాటిస్తూ సాగిపోయాడు. సిరాజ్‌, శార్దూల్‌ బౌలింగ్‌లో సిక్స్‌లూ కొట్టిన అతడు.. లంచ్‌ వేళకు 91తో నిలిచాడు. అతణ్ని ఔట్‌ చేస్తే తప్ప మంచి ఆధిక్యం సంపాదించడం కష్టమని భారత్‌కు అర్థమైపోయింది. అయితే లంచ్‌ తర్వాత బెయిర్‌స్టోకు సంతృప్తినిచ్చిన అంశం సెంచరీ పూర్తి చేయడమే. ఆ తర్వాత షమి అతణ్ని ఎక్కువసేపు నిలువనివ్వలేదు. ప్రమాదకరంగా మారిన అతణ్ని ఔట్‌ చేయడం ద్వారా అతడు భారత్‌లో ఆందోళన తొలగించాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని ఆడిన బెయిర్‌స్టో ఎడ్జ్‌తో స్లిప్‌లో కోహ్లీకి దొరికిపోయాడు. స్టోక్స్‌తో ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అతడు.. బిల్లింగ్స్‌తో ఏడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతడు ఔటయ్యేటప్పటికి ఇంగ్లాండ్‌ స్కోరు 241. చివర్లో విజృంభించిన సిరాజ్‌ మూడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. బెయిర్‌స్టో ఔటైన తర్వాతి ఓవర్లోనే బ్రాడ్‌ను వెనక్కి పంపిన అతడు.. ఆ తర్వాత బిల్లింగ్స్‌, పాట్స్‌ (19; 18 బంతుల్లో 3×4, 1×6)ను కూడా ఔట్‌ చేశాడు. పాట్స్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో ఆఖర్లో కొన్ని పరుగులు ఇంగ్లాండ్‌ ఖాతాలో చేరాయి.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 416

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: అలెక్స్‌ లీస్‌ (బి) బుమ్రా 6; క్రాలీ (సి) గిల్‌ (బి) బుమ్రా 9; ఒలీ పోప్‌ (సి) శ్రేయస్‌ (బి) బుమ్రా 10; రూట్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 31; బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) షమి 106; లీచ్‌ (సి) పంత్‌ (బి) షమి 0; స్టోక్స్‌ (సి) బుమ్రా (బి) శార్దూల్‌ 25; బిల్లింగ్స్‌ (బి) సిరాజ్‌ 36; బ్రాడ్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 1; పాట్స్‌ (సి) శ్రేయస్‌ (బి) సిరాజ్‌ 19; అండర్సన్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 35 మొత్తం: (61.3 ఓవర్లలో ఆలౌట్‌) 284; వికెట్ల పతనం: 1-16, 2-27, 3-44, 4-78; 5-83, 6-149, 7-241, 8-248, 9-267; బౌలింగ్‌: బుమ్రా 19-3-68-3; షమి 22-4-78-2; సిరాజ్‌ 11.3-2-66-4; శార్దూల్‌ 7-0-48-1; జడేజా 2-0-3-0

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: గిల్‌ (సి) క్రాలీ (బి) అండర్సన్‌ 4; పుజారా బ్యాటింగ్‌ 50; విహారి (సి) బెయిర్‌స్టో (బి) బ్రాడ్‌ 11; కోహ్లి (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 20; పంత్‌ బ్యాటింగ్‌ 30; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (45 ఓవర్లలో 3 వికెట్లకు) 125; వికెట్ల పతనం: 1-4, 2-43, 3-75; బౌలింగ్‌: అండర్సన్‌ 14-5-26-1; బ్రాడ్‌ 12-1-38-1; పాట్స్‌ 8-2-20-0; లీచ్‌ 1-0-5-0; స్టోక్స్‌ 7-0-22-1; రూట్‌ 3-1-7-0

ఇవీ చదవండి: నేను పొరపాటున టీమ్​ఇండియాకు కోచ్​ అయ్యాను: రవిశాస్త్రి

హిట్​మ్యాన్​​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. రోహిత్​కు క్వారంటైన్​ పూర్తి.. టీ20 సిరీస్​కు రెడీ

Last Updated : Jul 4, 2022, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.