ETV Bharat / sports

IPL 2021: టోర్నీ అప్పటి వరకు అంటే కష్టమే!

యూఏఈ వేదికగా ఐపీఎల్​(IPL 2021)లో మిగిలిన మ్యాచ్​లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఈ క్రమంలో అక్టోబరు 15న ఫైనల్​ను నిర్వహించాలని భావిస్తోంది. అయితే అందుకు అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC) అంగీకరించదని తెలుస్తోంది. అదే నెలలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​(ICC T20 World Cup) అందుకు కారణమని తెలుస్తోంది.

ICC 'unlikely to allow' BCCI to extend IPL 2021 window till October 15th
IPL 2021: టోర్నీ అప్పటి వరకు అంటే కష్టమే!
author img

By

Published : Jun 9, 2021, 7:18 AM IST

ఐపీఎల్‌-14 సీజన్​(IPL) రెండోదశ మ్యాచ్‌ల షెడ్యూలు తయారీలో సతమతమవుతున్న బీసీసీఐ(BCCI)కి ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. డబుల్‌హెడర్‌లను తగ్గించడం కోసం టోర్నీ జరిగే రోజులను పెంచాలని, అక్టోబరు 15న ఫైనల్‌ నిర్వహించాలని బోర్డు భావిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కానీ అక్టోబరు 10 దాటి టోర్నీని నిర్వహణకు అనుమతించేందుకు ఐసీసీ(ICC) సుముఖంగా లేదట.

ఐపీఎల్‌ మిగతా మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయని.. సెప్టెంబరు-అక్టోబరులో మ్యాచ్‌లు ఉంటాయని బీసీసీఐ గత నెలలోనే ప్రకటించింది. అయితే టీ20 ప్రపంచకప్‌(ICC T20 World Cup 2021)కు ముందు టోర్నీకి అనుమతి ఇవ్వగలుగుతామా లేదా అన్నది జూన్‌ చివరినాటికి చెబుతామని ఐసీసీ వెల్లడించింది. మరోవైపు మిగిలి ఉన్న 31 మ్యాచ్‌ల కోసం వీలైనన్ని ఎక్కువ రోజులు తీసుకోవాలన్నది బీసీసీఐ ఉద్దేశం. ఈ విషయమై గత కొన్ని రోజుల్లో వివిధ క్రికెట్‌బోర్డులతోనూ మాట్లాడింది. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 10న టోర్నీ ముగియాలి. ఈ తేదీ దాటి టోర్నీ నిర్వహించే అవకాశం లేదని ఐసీసీ వర్గాలు తెలిపాయి.

"టీ20 ప్రపంచకప్‌ అక్టోబరు 18న ఆరంభమవుతుంది. అప్పుడు అక్టోబరు 15 వరకు టోర్నీని కొనసాగించడం ఎలా సాధ్యమవుతుంది. ఇందుకు ఐసీసీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. అసలు.. ప్రపంచకప్‌లో పోటీపడుతున్న దేశాలు తమ ఆటగాళ్లు అక్టోబరు 15 వరకు ఐపీఎల్‌ ఆడేందుకు ఒప్పుకుంటాయా? అక్టోబరు 10 దాటి బీసీసీఐ ఐపీఎల్‌ను నిర్వహించదు" అని ఐసీసీ వర్గాలు చెప్పాయి.

అక్టోబరు మధ్యలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ నవంబరు 14న ఫైనల్‌తో ముగుస్తుందని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. ఇక బోర్డులతో ఐసీసీ అవగాహన ప్రకారం.. ఐసీసీ ఈవెంట్‌కు కనీసం 7-10 రోజుల ముందు ఎలాంటి టోర్నీ ఉండకూడదు.

ఇదీ చూడండి.. IPL: ఐపీఎల్ మిగతా మ్యాచ్​ల షెడ్యూల్ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.