ETV Bharat / sports

ఫిట్​నెస్​లో అదే నా ప్లస్ పాయింట్: ధోనీ

వయసు మీద పడుతున్నప్పటికీ ఫిట్​గా ఉండటం సానుకూలమైన విషయమని ధోనీ చెప్పాడు. జట్టులోని కుర్రాళ్లతో పోటీ పడటం మంచి సవాలని పేర్కొన్నాడు. రాజస్థాన్​ రాయల్స్​పై గెలవడం ఆనందంగా ఉందని అన్నాడు.

Dhoni, chennai super kings
మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్​
author img

By

Published : Apr 20, 2021, 8:35 AM IST

చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనీ తన ఫిట్​నెస్​ గురించి మాట్లాడాడు. జట్టులోని యువకులతో పోటీ పడటం చాలా కష్టమైన పని అని అన్నాడు. 39 ఏళ్ల వయసులోనూ తన ఫిట్​నెస్​ గురించి ఏ ఒక్కరూ వేలేత్తి చూపించకపోవడం తనకు పెద్ద సానుకూలత అని పేర్కొన్నాడు. వయసు పెరగడం, ఫిట్​గా ఉండటం రెండు భిన్నమైన అంశాలని అభిప్రాయపడ్డాడు.

"ఒక వ్యక్తి ఆడుతున్నప్పుడు, తాను ఫిట్​గా లేడని చెప్పించుకోవడానికి ఇష్టపడడు. యువ క్రికెటర్లతో పోటీ పడటం నిజంగా మంచిదే. ప్రతిసారి మంచి ప్రదర్శన ఇస్తామని కచ్చితంగా చెప్పలేం. అది 24 ఏళ్లప్పుడైనా.. 40 ఏళ్ల వయసులోనైనా. కానీ, ఇప్పటికీ ఫిట్​నెస్ విషయంలో నావైపు జనాలు వేలేత్తి చూపించకపోవడమే నాకున్న అతి పెద్ద సానుకూల అంశం"

-ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్

రాజస్థాన్​తో సోమవారం జరిగిన మ్యాచ్​లో చెన్నై గెలవడంపై ధోనీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ పోరులో 45 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. మొయిన్​ అలీ ఆల్​రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జడేజా నాలుగు క్యాచులు పట్టి మెప్పించాడు.

ఇదీ చదవండి: 'పోటీల్లో రాణిస్తాం.. ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తాం'

ఇదీ చదవండి: హెచ్​సీఏ అంబుడ్స్​మన్​ను నేనే.. జస్టిస్ దీపక్ వర్మ స్పష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.