ETV Bharat / sports

IPL 2021 News:'డివిలియర్స్​ ఆరోస్థానంలో ఆడడమేంటి?'

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు ఏబీ డివిలియర్స్​ను(De Villiers News) ఉపయోగించుకోవడం రావట్లేదని తెలిపాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(Gambhir on RCB). అతడిని ఆరో స్థానంలో అడించడమేంటని ప్రశ్నించాడు.

gambhir
గంభీర్
author img

By

Published : Oct 8, 2021, 2:00 PM IST

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తమ కీలక ఆటగాడైన ఏబీ డివిలియర్స్‌ను(De Villiers News) సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని మాజీ క్రికెటర్‌ గౌంతమ్‌ గంభీర్‌(Gautam Gambhir News) అభిప్రాయపడ్డాడు. ఇంతకుముందు టాప్‌ ఆర్డర్‌లో ఆడే దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ ఈ సీజన్‌లో పలు మ్యాచ్‌ల్లో ఆరో స్థానంలో ఆడుతున్నాడు. దీంతో మ్యాచ్‌ ఫినిషర్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. ఈ విషయంపై గంభీర్‌(Gambhir on RCB) స్పందించాడు. డివిలియర్స్‌తో ఓపెనింగ్‌ చేయించాలని.. లేదా వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గానైనా ఆడించాలని గంభీర్‌ సూచించాడు.

"బెంగళూరు జట్టు డివిలియర్స్‌ను ఎప్పటికీ ఓపెనర్‌గా లేదా నెంబర్‌ 3 బ్యాట్స్‌మన్‌గా ఆడించాలి. నా దృష్టిలో అతడు ఆరోస్థానంలో ఆడటంలో అర్థమేలేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రత్యర్థులపై చెలరేగడమే నేను ఇష్టపడతాను. అతడో అద్భుతమైన ఆటగాడు. అందుకే నేను డివిలియర్స్‌ ఆటను ఎక్కువగా చూడాలనుకుంటున్నా. అలాగే ఆ జట్టు మూడో స్థానంలో డేనియెల్‌ క్రిస్టియన్‌ను ఆడించొద్దు. కానీ వాళ్లు అదే పని చేస్తారు. అతడికి బదులు శ్రీలంక ఆటగాళ్లు దుష్మంత చమీరా, వానిందు హసరంగను ఆడించాలి"

-గౌతమ్ గంభీర్‌, మాజీ క్రికెటర్.

ఈ సీజన్‌లో డివిలియర్స్‌ మిడిల్‌ ఆర్డర్‌లో వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌ చేసి మొత్తం 276 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు.

ఇదీ చదవండి:

'నాకే అధికారం ఉంటే.. ఆ మాటల్ని వినిపిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.