ETV Bharat / sports

ధోనీ గుడ్​లక్ చెప్పడు.. ఎందుకంటే? - ప్రజ్ఞాన్‌ ఓజా వార్తలు

టీమ్ఇండియా మాజీ సారథి ధోనీకి ఓ సెంటిమెంట్ ఉందట. మ్యాచ్​కు ముందు తన జట్టు ఆటగాళ్లకు గుడ్​లక్ చెప్పడం ఇష్టం ఉండదట మహీకి. ఈ విషయాన్ని మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా వెల్లడించాడు.

pragyan ojha
మాజీ స్పిన్నర్​ ప్రజ్ఞాన్​ ఓజా
author img

By

Published : Apr 21, 2021, 8:05 PM IST

Updated : Apr 21, 2021, 8:27 PM IST

టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ఓ సెంటిమెంట్‌ ఉందని మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా వెల్లడించాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు. అందువల్లే మ్యాచ్‌లకు ముందు ధోనీ తన జట్టు ఆటగాళ్లకు గుడ్‌లక్‌ లేదా బెస్టాఫ్‌ లక్‌ చెప్పడన్నాడు.

"మహీ మ్యాచ్‌లకు ముందు తన జట్టు ఆటగాళ్లకు గుడ్‌లక్‌, బెస్టాఫ్‌ లక్‌ లాంటి శుభాకాంక్షలు ఎప్పుడూ చెప్పడు. ఎందుకంటే ఇదివరకు కొంతమంది ఆటగాళ్లకు ఒక మ్యాచ్‌లో అలా చెప్పినప్పుడు ఫలితాలు మరోలా వచ్చాయని బలమైన నమ్మకం. అందుకే అలా చెప్పడం మానేసి ఉంటాడు. ఒకసారి మేమంతా ప్రజలకుండే వివిధ సెంటిమెంట్ల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో తన ఆటగాళ్లకు మ్యాచ్‌కు ముందు శుభాకాంక్షలు చెప్పనన్నాడు. అలాగే ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు కూడా మ్యాచ్‌కు ముందు మహీని కలవరు. అతడి నుంచి ఎలాంటి శుభాకాంక్షలు వాళ్లు ఆశించరు."
-ప్రజ్ఞాన్ ఓజా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. తొలి మ్యాచ్‌లో దిల్లీ చేతిలో ఓటమిపాలైన ధోనీసేన తర్వాత పుంజుకుని రెండు వరుస విజయాలు సాధించింది. పంజాబ్‌పై ఆరు వికెట్ల తేడాతో, రాజస్థాన్‌పై 45 పరుగుల తేడాతో ఘన విజయాలు నమోదు చేసింది. ఇక తర్వాతి మ్యాచ్‌ కోల్‌కతాతో తలపడనుంది.

ఇవీ చదవండి: ధోనీ తల్లిదండ్రులకు కరోనా

ఛేదనలో తేలిపోయిన రాజస్థాన్​.. చెన్నైదే గెలుపు

Last Updated : Apr 21, 2021, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.