ETV Bharat / sports

'ధోనీ.. ఏడో స్థానంలో వచ్చి ఏం సాధించలేవ్​' - gambhir on dhoni no 7

బ్యాటింగ్​ ఆర్డర్​లో ముందు రావాలని చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్ ధోనీకి సూచించాడు మాజీ క్రికెటర్​ గంభీర్. ఏడో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చి మహీ జట్టును నడిపించలేడని.. నాలుగు లేదా ఐదు స్థానాల్లో క్రీజులోకి రావాలని అభిప్రాయపడ్డాడు.

dhoni, gambhir
ధోనీ, గంభీర్
author img

By

Published : Apr 16, 2021, 12:29 PM IST

ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనీ వరుస బ్యాటింగ్​ వైఫల్యాలపై స్పందించాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్​ గంభీర్​. బ్యాటింగ్ ఆర్డర్​లో ముందుగా రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: స్వర్ణంతో మెరిసిన సరిత.. మరో ఇద్దరికి కాంస్యాలు

"ఎంఎస్​ ధోనీ ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాల్సిన అవసరముంది. నాయకుడు అనే వాడు ముందుండి నడిపించాలి. లీడర్​ ముందుండి నడిపించాలని ఏళ్లుగా చెబుతూనే ఉన్నాం. బ్యాటింగ్​ ఆర్డర్​లో ధోనీ 7వ స్థానంలో వచ్చి ఆధిపత్యం చెలాయించలేడు. అతడు నాలుగు లేదా ఐదో స్థానంలో క్రీజులోకి రావాలి. నాలుగైదేళ్ల క్రితం ధోనీలా ఇప్పుడు లేడు. సీఎస్కే బౌలింగ్​లో సమస్యలు ఉన్నాయి." అని గౌతమ్​ గంభీర్​ పేర్కొన్నాడు.

దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో ఏడో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చిన ధోనీ.. డకౌట్​ అయ్యాడు. ఈ మ్యాచ్​లో 188 పరుగులు చేసినప్పటికీ సీఎస్కే ఓడిపోయింది. ధోనీ సేన తన తదుపరి మ్యాచ్ వాంఖడే వేదికగా సోమవారం..​ రాజస్థాన్ రాయల్స్​తో ఆడనుంది.

ఇదీ చదవండి: 'ప్లాన్-బీ'తో ఒలింపిక్స్​కు సాత్విక్-చిరాగ్​ జోడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.