ETV Bharat / sports

ధోనీ లేకపోతే నా కెరీర్​ లేదు: బ్రావో - ఐపీఎల్ బ్రావో ధోనీ

తనకు ధోనీతో ఉన్న అనుబంధం గురించి స్టార్ ఆల్​రౌండర్ బ్రావో చెప్పాడు. మహీ లేనిదే తన కెరీర్​ లేదని అన్నాడు. సీఎస్కేలో గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి ఆడారు.

dhoni bravo
ధోనీ బ్రావో
author img

By

Published : Dec 8, 2021, 9:01 PM IST

చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ లేనిదే తన కెరీర్‌ లేదని వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్నాడు. తాను క్రికెట్‌ కెరీర్​లో ఎదిగేందుకు ధోనీ వ్యక్తిగతంగా చాలా సహాయపడ్డాడని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో చెన్నై జట్టుతో తమ బంధం విడదీయలేనిదని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ వార్తా సంస్థతో మాట్లాడిన బ్రావో పలు విషయాలు వెల్లడించాడు.

‘వచ్చే సీజన్‌ కోసం చెన్నై యాజమాన్యం నన్ను అట్టి పెట్టుకోలేదు. వేలంలో మళ్లీ నన్ను దక్కించుకుంటుందని కూడా కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం నేను వేలంలో ఉన్నాను. ఏ జట్టు కొనుగోలు చేస్తుందో తెలియదు. చెన్నై కెప్టెన్‌ ధోనీతో నా అనుబంధం ఎలాంటిదో మీకందరికీ తెలుసు. ఒకరినొకరం బ్రదర్‌ అని పిలుచుకునే వాళ్లం. ధోనీ లేనిదే నా కెరీర్ లేదు. నా క్రికెట్ కెరీర్‌ ఎదుగుదలకు ధోనీ వ్యక్తిగతంగా చాలా తోడ్పడ్డాడు. చెన్నై జట్టుతో మా అనుబంధం విడదీయలేనిది’ అని బ్రావో పేర్కొన్నాడు.

dhoni bravo
చెన్నై సూపర్​ కింగ్స్ టీమ్

ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌ తర్వాత బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్-2022 సీజన్‌కు సంబంధించి సీఎస్కే యాజమాన్యం ఇప్పటికే రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, రుతురాజ్‌ గైక్వాడ్, మొయిన్‌ అలీలను రిటెయిన్ చేసుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.