చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ (MI vs DC) విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించి అధికారికంగా (IPl 2021) ప్లే ఆఫ్స్‌కి చేరింది. ఛేదనకు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌కి ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. పవర్ ప్లే పూర్తి కాకముందే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శిఖర్ ధావన్ (8), పృథ్వీ షా (6), స్టీవెన్ స్మిత్ (9) వరుసగా పెవిలియన్ చేరారు. రిషభ్ పంత్ (26) ఫర్వాలేదనిపించాడు. అక్షర్ పటేల్ (9), షిమ్రోన్ హెట్‌మైర్ (15) ఆకట్టుకోలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ (33) రవి చంద్రన్ అశ్విన్ (20)తో కలిసి నిలకడగా ఆడుతూ జట్టును (DC Won the Match) విజయ తీరాలకు చేర్చాడు. ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్య, నాథన్ కౌల్టర్ నైల్, బుమ్రా తలో వికెట్ తీశారు.
కుప్పకూలిన ముంబయి..
అంతకు ముందు (IPl 2021 News) టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ముంబయి ఇండియన్స్ (MI vs DC score card) నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబయి జట్టుకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(7) అవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో బౌల్డయ్యాడు. మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్ (19) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అక్షర్ పటేల్ వేసిన ఏడో ఓవర్లో నోర్జేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సౌరభ్ తివారి (15), కీరన్ పొలార్డ్(6) ఆకట్టుకోలేకపోయారు. ఆఖర్లో వచ్చిన హార్దిక్ పాండ్య (17), జయంత్ యాదవ్ (11) నిరాశ పరిచాడు. నాథన్ కౌల్టర్ నైల్ (0) డకౌటయ్యాడు. కృనాల్ పాండ్య (13), జస్ప్రీత్ బుమ్రా (1) నాటౌట్‌గా నిలిచారు. దిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు, అవేశ్ ఖాన్ మూడు, అన్రిచ్ నోర్జే, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: 'వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో అతడికి భారీ ధర'