ETV Bharat / sports

మరో దిల్లీ ఆటగాడికి కరోనా... పంజాబ్​తో మ్యాచ్​ డౌటే! - దిల్లీ క్యాపిటల్స్ కరోనా

DELHI CAPITALS player Covid: కరోనా కేసులు ఐపీఎల్​ను కుదిపేస్తున్నాయి! దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన మరో ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. యాంటీజెన్ పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్​గా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో.. బుధవారం పంజాబ్​తో జరగాల్సిన మ్యాచ్​పై నీలినీడలు కమ్ముకున్నాయి.

Tim Seifert tests positive
Tim Seifert tests positive
author img

By

Published : Apr 20, 2022, 5:31 PM IST

DELHI CAPITALS player covid: దిల్లీ క్యాపిటల్స్ జట్టు కరోనా హాట్​స్పాట్​గా మారింది! మరో ఆటగాడికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. పంజాబ్​తో బుధవారం మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు. యాంటీజెన్ పరీక్షలో న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్‌​కు కరోనా వచ్చినట్లు నిర్ధరణ అయిందని సంబంధిత అధికారులు తెలిపారు. అతడి ఆర్​టీపీసీఆర్ టెస్టు ఫలితం రావాల్సి ఉందన్నారు. ఐపీఎల్​లో ఇప్పటివరకు ఆరు కేసులు బయటపడగా.. అన్నీ దిల్లీ క్యాపిటల్స్​కు చెందినవే కావడం గమనార్హం.

IPL 2022 Covid: ఇదివరకు మిచెల్ మార్ష్, ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాట్ సహా ఏప్రిల్ 15 నుంచి 18 మధ్య ఆరుగురు కరోనాకు పాజిటివ్​గా తేలారు. ఈ నేపథ్యంలోనే పుణెలో జరగాల్సిన మ్యాచ్​ను ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో నిర్వహిస్తోంది బీసీసీఐ. అయితే, మరికొద్దిగంటల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆటగాడు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఆర్​టీపీసీఆర్​లోనూ సీఫెర్ట్‌కు పాజిటివ్​గా తేలితే.. అతడిని ఐసోలేషన్​కు తరలిస్తారు. అనంతరం, మిగితా ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహిస్తారు. గత ఐపీఎల్ సీజన్​లోనూ సీఫెర్ట్ కరోనా బారిన పడటం గమనార్హం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం కనీసం 12 మంది ఆటగాళ్లు(ఏడుగురు భారతీయులు) గేమ్​కు అందుబాటులో ఉండాలి. లేదంటే మ్యాచ్​ను రీషెడ్యూల్ చేస్తారు.

ఇదీ చదవండి: కొవిడ్ దెబ్బ.. దిల్లీ, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.