ETV Bharat / sports

స్టేడియం​లో చెన్నై క్రికెటర్​​ లవ్​ ప్రపోజల్​ - IPL Live Score

ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్, పంజాబ్​ కింగ్స్​ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. చెన్నై బౌలర్​ దీపక్​ చాహర్​.. స్టాండ్స్​లో అందరి ముందు తన ప్రేయసికి లవ్​ ప్రపోజ్​ చేశాడు. అందుకు ఆమె అంగీకరించగా.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Deepak Chahar Proposes To Girlfriend After CSK's IPL Game
స్టేడియం​లోనే చెన్నై క్రికెటర్​​ లవ్​ ప్రపోజల్​
author img

By

Published : Oct 7, 2021, 9:44 PM IST

చెన్నై సూపర్​కింగ్స్​, పంజాబ్​ కింగ్స్​ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్​ అనంతరం సీఎస్​కే బౌలర్​​ దీపక్​ చాహర్​ అందరూ చూస్తుండగా.. తన ప్రేయసికి రింగ్​ చూపిస్తూ లవ్​ ప్రపోజ్​ చేశాడు. అందుకు ఆ అమ్మాయి అంగీకరించగా.. ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు కౌగిలించుకొని.. ముద్దుపెట్టుకున్నారు.

ఈ సన్నివేశం చూసిన స్టేడియంలోని ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. దీపక్​ చాహర్​ ప్రపోజ్​ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. చాహర్​ ప్రేయసి ఎవరు? అని నెటిజన్లు గూగుల్​లో వెతకడం మొదలెట్టారు. అయితే ఆ అమ్మాయి ఎవరు? దీపక్​ చాహర్​కు ఎప్పటినుంచి పరిచయం? అనే విషయాలు తెలియాల్సిఉంది.

ఇదీ చూడండి.. CSK Vs PBKS: పంజాబ్ ధమాకా.. చెన్నైపై అదిరిపోయే గెలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.