ETV Bharat / sports

IPL 2021: ఫైనల్​ చేరేందుకు దిల్లీ-కోల్​కతా అమీతుమీ - కోల్​కతా X దిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్​-14(IPL 2021) రెండో క్వాలిఫయర్​ మ్యాచ్​ నేడు జరగనుంది. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న దిల్లీ క్యాపిటల్స్​తో ఢీ కొట్టనుంది కోల్​కతా నైట్ రైడర్స్(DC vs KKR 2021). రాత్రి 7.30 నుంచి మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంటి ముఖం పట్టాల్సిందే కాబట్టి విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడడం ఖాయం.

DC vs KKR
పంత్, మోర్గాన్
author img

By

Published : Oct 13, 2021, 6:58 AM IST

ఈ ఐపీఎల్‌ సీజన్లో(IPL 2021) అత్యంత నిలకడగా ఆడి, లీగ్‌ దశలో అత్యధిక విజయాలు సాధించిన జట్టు దిల్లీ క్యాపిటల్స్‌(DC vs KKR 2021). లీగ్‌లో ఎంతో సమతూకంతో కనిపించిన జట్టు కూడా అదే. రెండు వారాల ముందు వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో దిల్లీ(IPL qualifier 2) తలపడితే విజయం ఎవరిదంటే చాలామంది రిషబ్‌ పంత్‌ జట్టు పేరే చెప్పేవాళ్లేమో! కానీ గత కొన్ని మ్యాచ్‌ల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రదర్శన చూశాక ఇప్పుడు దిల్లీ గెలుపుపై ధీమా కలగడం కష్టమే. తొలి అంచెలో పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌ రేసులోనే లేదనుకున్న జట్టు యూఈఏలో రెండో అంచెలో దూకుడుగా ఆడి చివరి 8 మ్యాచ్‌ల్లో ఆరు నెగ్గి రెండో క్వాలిఫయర్‌కు సిద్ధమైన జట్టు నైట్‌రైడర్స్‌. మరి సమవుజ్జీల పోరులా కనిపిస్తున్న ఈ మ్యాచ్‌లో నెగ్గి చెన్నైతో టైటిల్‌ పోరుకు అర్హత సాధించే జట్టేదో?

kkr
మోర్గాన్

లీగ్‌ దశలో తొలి ముఖాముఖి మ్యాచ్‌లో దిల్లీ నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచింది. యూఏఈలో రెండో అంచె ఆరంభమైనప్పటి నుంచి కోల్‌కతా రెండోసారి బ్యాటింగ్‌ చేసిన ప్రతిసారీ గెలిచింది. దిల్లీ ఈ సీజన్లో ఓడిన అయిదు మ్యాచ్‌లూ మొదట బ్యాటింగ్‌ చేసినప్పటివే. రెండో క్వాలిఫయర్‌ వేదికైన షార్జాలో ఈ సీజన్లో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదుసార్లు లక్ష్యాన్ని ఛేదించిన జట్టే నెగ్గింది.

షార్జా

ఐపీఎల్‌-14లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. బుధవారమే రెండో క్వాలిఫయర్‌(IPL qualifier 2). సీజన్‌ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న దిల్లీ క్యాపిటల్స్‌.. రెండో అంచె నుంచి గొప్పగా పుంజుకుని వరుస విజయాలతో రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌(IPL eliminator match) ఫైనల్లో చోటు కోసం అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. రెండు జట్లలో ఫేవరెట్‌ ఏదని చెప్పడం కష్టమే. అయితే గత కొన్ని మ్యాచ్‌ల ప్రదర్శన చూస్తే కోల్‌కతాదే కాస్త పైచేయిగా ఉంది. స్వదేశంలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండే నెగ్గి ప్లేఆఫ్స్‌ రేసులోనే లేనట్లు కనిపించిన కోల్‌కతా.. యూఏఈలో రెండో అంచెలో చక్కటి ప్రదర్శన చేసింది. ఏడు మ్యాచ్‌ల్లో అయిదు నెగ్గి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ప్రతి మ్యాచ్‌ గండంగా మారిన స్థితిలో ఒత్తిడిలో ఆ జట్టు చేసిన ప్రదర్శన అద్భుతం. చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలతో ఆ జట్టు రెండో క్వాలిఫయర్‌కు సిద్ధమైంది. అదే సమయంలో దిల్లీ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. లీగ్‌ దశలో ముఖాముఖి మ్యాచ్‌ల్లో దిల్లీ, కోల్‌కతా తలో విజయం సాధించాయి. చివరి మ్యాచ్‌లో కోల్‌కతాదే పైచేయి.

morgan, pant
మోర్గాన్, పంత్

జోరుమీద నైట్‌రైడర్స్‌

సొంతగడ్డపై తొలి అంచెలో నిరాశపరిచిన నైట్‌రైడర్స్‌.. రెండో అంచెలో పుంజుకున్న తీరు అనూహ్యం. ఆ జట్టులో ప్రధానంగా జరిగిన మార్పు దేశవాళీ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ను ఓపెనర్‌గా తీసుకురావడం. గిల్‌తో కలిసి అతను చక్కటి ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతను పార్ట్‌టైం బౌలర్‌గా, ఫీల్డర్‌గానూ జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. చాలా మ్యాచ్‌ల్లో గిల్‌, వెంకటేశ్‌లే బ్యాటింగ్‌ భారాన్ని మోశారు. రాహుల్‌ త్రిపాఠి నితీశ్‌ రాణా కాస్త వీరికి తోడ్పాటునందించారు. మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌ పెద్దగా ఆడింది లేకున్నా కోల్‌కతా ఇక్కడిదాకా వచ్చేసింది. బౌలింగ్‌ నైట్‌రైడర్స్‌కు పెద్ద బలం అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ నిలకడగా రాణిస్తుండగా.. వీరికి షకిబ్‌ కూడా తోడయ్యాడు. నరైన్‌ అప్పుడప్పుడూ బ్యాటుతోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. షకిబ్‌ నాణ్యమైన బ్యాట్స్‌మన్‌ కూడా కావడం కలిసొచ్చే అంశం. పేస్‌ విభాగంలో ఫెర్గూసన్‌, మావి కూడా రాణిస్తున్నారు. మొత్తంగా గత కొన్ని మ్యాచ్‌ల నుంచి నిలకడ, దూకుడుతో ఆకట్టుకుంటున్న కోల్‌కతా రెండో క్వాలిఫయర్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. అయితే ఓపెనర్లు విఫలమైతే, స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించకుంటే మాత్రం కోల్‌కతాకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

దిల్లీకి తలనొప్పులున్నా..

లీగ్‌ దశలో మిగతా జట్లన్నింటికంటే ఎక్కువ విజయాలు సాధించి దిల్లీకి రెండో క్వాలిఫయర్‌ ముంగిట తలనొప్పులు తప్పట్లేదు. ధావన్‌ ఉన్నట్లుండి ఫామ్‌ కోల్పోయాడు. అశ్విన్‌ నిలకడ అందుకోవట్లేదు. రబాడ కూడా అంచనాలకు తగ్గట్లు రాణించట్లేదు. అయ్యర్‌ సైతం వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ ఆ జట్టుకు ఇబ్బందులు తప్పట్లేదు. పృథ్వీ ఫామ్‌ అందుకోవడం సంతోషాన్నిచ్చే విషయమే అయినా.. బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణిస్తే తప్ప పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించడం, ఛేదించడం సాధ్యం కాదు. స్టాయినిస్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే జట్టుకు సమతూకం వస్తుందని దిల్లీ చూస్తోంది కానీ.. అతడి ఫిట్‌నెస్‌పై స్పష్టత రావట్లేదు. అతను ఫిట్‌గా ఉంటే టామ్‌ కరన్‌, రబాడల్లో ఒకరిని తప్పించి తుది జట్టులో ఆడించే అవకాశముంది. కానీ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేని అతను ఏమేర రాణిస్తాడో చూడాలి. ఇక్కడి పిచ్‌, బ్యాటింగ్‌ బలం తగ్గిన దృష్ట్యా స్టీవ్‌ స్మిత్‌ను ఆడించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. మరోవైపు స్పిన్‌ పిచ్‌ల మీద అశ్విన్‌ రాణించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే కోల్‌కతా జట్టులో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అతణ్ని తప్పించకపోవచ్చు. అక్షర్‌, నార్జ్‌, అవేష్‌ నిలకడగా రాణిస్తుండటం దిల్లీకి కలిసొచ్చే అంశం. ఇటీవలి జట్టు, ఆటగాళ్ల ఫామ్‌ కొంత ఆందోళన రేకెత్తిస్తున్నప్పటికీ.. దిల్లీ మెరుగైన జట్టే. ఆటగాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మాత్రం క్యాపిటల్స్‌కు తిరుగుండదు.

పిచ్‌ ఎలా..?

బెంగళూరు-కోల్‌కతా మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరిగిన షార్జా మైదానంలోనే రెండో క్వాలిఫయర్‌ కూడా జరగబోతోంది. ఇక్కడి పిచ్‌పై బ్యాటింగ్‌ అంత తేలిక కాదు. నెమ్మదిగా ఉండే ఈ వికెట్‌పై బంతి బాగా తిరుగుతుంది. కాబట్టి ఇరు జట్లూ స్పిన్నర్లకే పెద్ద పీట వేస్తాయనడంలో సందేహం లేదు. నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, షకిబ్‌లతో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ జాగ్రత్తగా ఉండాల్సిందే. దిల్లీ జట్టులో అక్షర్‌ పటేల్‌ ప్రమాదకరంగా మారొచ్చు. ఫామ్‌లో లేని అశ్విన్‌ ఈ పిచ్‌ను ఏమేర ఉపయోగించుకుంటాడో చూడాలి. సోమవారం ఉపయోగించిన పిచ్‌ మీదే మ్యాచ్‌ జరిగితే మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 140-150కి మించి స్కోరు చేయకపోవచ్చు. ఇక్కడ జరిగిన చివరి 7 మ్యాచ్‌ల్లో అయిదుసార్లు మొదట బౌలింగ్‌ చేసిన జట్టే గెలిచింది. కాబట్టి రెండు జట్లూ టాస్‌ గెలిస్తే ఛేదనకే మొగ్గు చూపుతాయి.

తుది జట్లు (అంచనా)

దిల్లీ క్యాపిటల్స్‌: పంత్‌ (కెప్టెన్‌), ధావన్‌, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌, హెట్‌మయర్‌, స్టాయినిస్‌/స్టీవ్‌ స్మిత్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, నార్జ్‌, రబాడ/టామ్‌ కరన్‌, అవేష్‌ ఖాన్‌.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా దినేశ్‌ కార్తీక్‌, షకిబ్‌, నరైన్‌, ఫెర్గూసన్‌, మావి, వరుణ్‌ చక్రవర్తి.

ఇదీ చదవండి:

Kolkata Knight Riders: యూఏఈలోనే కోల్‌'కథ' మలుపు తిరిగింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.