చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆట ప్రారంభానికి ముందు సీఎస్కే ఆటగాడు సురేశ్ రైనా తన మాజీ సహచర క్రికెటర్ హర్భజన్ సింగ్ పాదాలకు నమస్కరించాడు. భజ్జీ ఆశ్చర్యపోయి వెంటనే రైనాను పైకి లేపి కౌగిలించుకున్నాడు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇరువురి మధ్య ఆప్యాయత చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- — Sportzhustle_Squad (@sportzhustle) April 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— Sportzhustle_Squad (@sportzhustle) April 21, 2021
">— Sportzhustle_Squad (@sportzhustle) April 21, 2021
గతేడాది వరకు చెన్నైకి ప్రాతినిధ్యం వహించాడు హర్భజన్. కానీ అనివార్య కారణాల వల్ల యూఏఈలో జరిగిన చివరి సీజన్లో ఆడలేకపోయాడు. ఈ సీజన్‌కు ముందు జరిగిన వేలంలో ఇతడిని సీఎస్కే వదులుకోగా.. కేకేఆర్ 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది.