ETV Bharat / sports

IPL 2021: ఐపీఎల్‌ మళ్లీ షురూ.. పిచ్​లు ఇవే! - ఐపీఎల్‌ 14 సీజన్

ఆదివారం నుంచే ఐపీఎల్ 14వ సీజన్(Ipl14 Season) రెండో దశ ప్రారంభం కానుంది. కానీ భారత్​లో కాదు. యూఏఈలో. మరి దుబాయ్​లో మ్యాచ్​లు జరగనున్న స్టేడియాలు, పిచ్​ల వివరాలేంటో తెలుసుకుందామా..?

Ipl14 Season
ఐపీఎల్‌ 14
author img

By

Published : Sep 18, 2021, 6:43 AM IST

Updated : Sep 18, 2021, 9:31 AM IST

కరోనా కారణంగా ఈ ఏడాది మేలో అర్థంతరంగా ఆగిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌(Ipl14 Season) సందడి మళ్లీ షూరూ కాబోతుంది. కానీ భారత్‌లో కాదు.. యూఏఈలో. వేదికలు మాత్రమే మారాయంతే.. ఐపీఎల్‌ అందించే కిక్కులో ఎలాంటి తేడా ఉండదు. ఆదివారం నుంచే ఆనందం మొదలు. ఈ నేపథ్యంలో యూఏఈలోని స్టేడియాలు.. అందులోని పిచ్‌ల విశేషాలు చూసేద్దాం పదండి!

అబుదాబి..

.
.

సెప్టెంబర్‌ నెలలో ఇక్కడ సుమారు 40 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉష్ణోగ్రత. గత సీజన్‌లో ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు 8 మ్యాచ్‌ల్లో, ఛేదన చేసిన జట్లు 12 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. తొలి, రెండో ఇన్నింగ్స్‌ల సగటు స్కోర్లు వరుసగా 140, 129. ఇక్కడ ఇటీవల ముగిసిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో పేసర్లదే ఆధిపత్యం. గత ఐపీఎల్‌ సీజన్‌లో ఈ మైదానంలో ఓ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక స్కోరు 196. అత్యల్ప స్కోరు 84.

షార్జా..

.
.

ఇక్కడ 40 నుంచి 41 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదవుతుంది. దుబాయ్‌, అబుదాబితో పోల్చుకుంటే ఈ స్టేడియం చిన్నది కావడం ఫీల్డర్లకు ఉపశమనాన్ని కలిగించేదే. ఇక్కడ బౌండరీల మోత ఖాయం. గతేడాది ఐపీఎల్‌లో ఛేదన చేసిన జట్లు 7 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు 5 విజయాలు సాధించాయి. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 149. రెండో ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 131 మాత్రమే. గత ఐపీఎల్‌ సీజన్‌లో ఈ స్టేడియంలో ఓ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక, అత్యల్ప స్కోర్లు వరుసగా 228, 112.

దుబాయ్​..

.
.

అబుదాబి, షార్జా కంటే ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. 42 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో ఛేదనలోనే ఎక్కువ విజయాలు దక్కాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 9 మ్యాచ్‌ల్లో గెలవగా.. రెండో సారి బ్యాటింగ్‌కు దిగిన జట్టు 14 మ్యాచ్‌ల్లో లక్ష్యాన్ని చేరుకుంది. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 144 కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో అది 122గా ఉంది. దుబాయ్‌ స్టేడియంలో గత ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక స్కోరు 219.. అత్యల్ప స్కోరు 109.

ఇదీ చదవండి: 'కోహ్లీ ఒకటి చెబితే బీసీసీఐ మరొకటి చెబుతోంది'

Last Updated : Sep 18, 2021, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.