ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌గా మళ్లీ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో వచ్చి చేరింది. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన తదితర కారణాలతో గతేడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి వివో తప్పుకుంది. మళ్లీ పరిస్థితులు సద్దుమణగడం వల్ల వివో.. మళ్లీ టైటిల్‌స్పాన్సర్‌గా చేరినట్లు తెలుస్తోంది.
2018 నుంచి 2022 వరకు రూ.2,190 కోట్లకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను వివో దక్కించుకుంది. ఇందుకోసం ఏడాదికి 440 కోట్ల రూపాయలను బీసీసీఐకి వివో సంస్థ చెల్లించనుంది. 2023 వరకు వివో ఐపీఎల్ టైటిల్‌స్పాన్సర్‌గా కొనసాగనుంది. గతేడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించిన డ్రీమ్‌ఎలెవన్ బీసీసీఐకి రూ.222 కోట్లు చెల్లించింది.
ఇదీ చూడండి: 'వరుస టీ20 ప్రపంచకప్‌లతో ఆసక్తి తగ్గిపోతుంది!'