ETV Bharat / sports

CSK Vs RR: గైక్వాడ్ సెంచరీ.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం - chennai super kings vs rajasthan royals

రాజస్థాన్​తో మ్యాచ్​లో (CSK Vs RR) మెరుపులు మెరిపించాడు చెన్నై యువ సంచలనం రుతురాత్ గైక్వాడ్. ఆకట్టుకునే షాట్లతో సెంచరీ (101*) సాధించాడు. దీంతో రాజస్థాన్​ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది సీఎస్​కే.

CSK Vs RR
CSK Vs RR
author img

By

Published : Oct 2, 2021, 9:30 PM IST

రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో (CSK Vs RR) శతకంతో (101*) చెలరేగాడు చెన్నై సూపర్​ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన సీఎస్​కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఆఖర్లో జడేజా (15 బంతుల్లో 32) మెరుపులు మెరిపించాడు. డుప్లెసిస్ (25), మొయిన్​ అలీ (21) పర్వాలేదనిపించారు.

సురేశ్ రైనా (3) మరోసారి విఫలమయ్యాడు. అంబటి రాయుడు (2) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. రాజస్థాన్​ బౌలర్లలో రాహుల్ తెవాటియా 3 వికెట్లు, చేతన్ సకారియా ఒక వికెట్ తీశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.