చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ చెన్నై తరఫున 200 మ్యాచులు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఓ వేడుక నిర్వహించింది. పంజాబ్ జట్టు మీద ఆరు వికెట్ల ఘన విజయం అనంతరం ఈ సంబరాలు చేసుకుంది. అభిమానుల కోసం దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ధోనీ కేక్ కట్ చేస్తుండగా తీసిన ఈ వీడియో వైరల్ అయింది. రైనా, కోచ్ ఫ్లెమింగ్‌తో పాటు పలువురు చెన్నై ఆటగాళ్లు ఇందులో సందడి చేశారు.
-
A treat to Thala on his 200th and icing on the cake for all of us! #Thala200 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ErkDrHewdZ
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">A treat to Thala on his 200th and icing on the cake for all of us! #Thala200 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ErkDrHewdZ
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) April 17, 2021A treat to Thala on his 200th and icing on the cake for all of us! #Thala200 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ErkDrHewdZ
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) April 17, 2021
కాగా, శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను 106 పరుగులకే కట్టడి చేసిన ధోనీసేన సునాయాస విజయం సాధించింది. దీపక్ చాహర్ 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. డుప్లెసిస్, మొయిన్ అలీ రాణించారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. తర్వాతి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.
చెన్నైని 2010, 2011, 2018 సీజన్లలో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ ఈ 2021 ఐపీఎల్‌లోనూ తన మార్క్ చూపిస్తాడని ఆశిస్తోంది జట్టు యాజమాన్యం.ఇప్పటివరకు ఛాంపియన్స్ లీగ్‌లో సీఎస్కే తరఫున 24 మ్యాచ్‌లు ఆడిన ధోనీకి ఐపీఎల్లో ఇది 176వ మ్యాచ్. అలాగే మొత్తంగా లీగ్‌లో మహీకి ఇది 206వ మ్యాచ్. 2016, 17 సీజన్లలో సీఎస్కే నిషేధం ఎదుర్కొన్న సమయంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు 30 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడీ టీమ్ఇండియా మాజీ సారథి.