ETV Bharat / sports

CSK Vs KKR: వరుస విజయాల జోరును కొనసాగించేదెరు? - ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్

ఐపీఎల్​ రెండో దశలో(IPL 2021) వరుస విజయాలతో కొనసాగుతోన్న చెన్నై సూపర్​కింగ్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లు(CSK Vs KKR).. ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్​లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్​లో గెలిచి ప్లేఆఫ్స్​ రేసులో మరింత ముందుకు వెళ్లేందుకు కోల్​కతా సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్​తో ప్లేఆఫ్స్​లో(IPL Playoffs 2021) అడుగుపెట్టాలని ధోనీసేన ఊవిళ్లురూతుంది.

Chennai boy Varun Chakravarthy pose biggest threat for Chennai Super Kings
CSK Vs KKR: వరుస విజయాల జోరును కొనసాగించేదెరు?
author img

By

Published : Sep 26, 2021, 8:10 AM IST

Updated : Sep 26, 2021, 11:45 AM IST

ఐపీఎల్​లో(IPL 2021) మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. యూఏఈ వేదికగా జరుగుతోన్న టోర్నీ రెండోదశలో ఇప్పటివరకు ఓటమిని ఎదుర్కొని రెండు టీమ్స్ ఇప్పుడు పోటీపడనున్నాయి. ఐపీఎల్​లో ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​, కోల్​కతా నైట్​రైడర్స్(CSK Vs KKR)​ తలపడనున్నాయి. ఈ మ్యాచ్​లో గెలిచి ప్లేఆఫ్స్​కు(IPL Playoffs 2021) చేరాలని ధోనీసేన.. అదే విధంగా వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో ఎగబాకాలని కోల్​కతా సన్నాహాలు చేస్తున్నాయి.

చెన్నై కుర్రాడు చెలరేగుతాడా?

ఐపీఎల్​ రెండో దశలో కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్​ ఆశలు సజీవం చేసుకున్న కేకేఆర్​.. ఈ మ్యాచ్​లో నెగ్గి, పాయింట్ల పట్టికలో మరింత ముందుకెళ్లాలని ప్రణాళికలను రచిస్తుంది. అయితే బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో తన స్పిన్​ మాయాజాలంతో ఆకట్టుకున్న చెన్నై కుర్రాడు వరుణ్​ చక్రవర్తి.. తన హోమ్​టీమ్ సీఎస్​కేపై ఏవిధంగా చెలరేగుతాడు? అని ఫ్యాన్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టోర్నీలోనూ చెన్నై బ్యాట్స్​మెన్ రుతురాజ్​ గైక్వాడ్​, ఫాఫ్​ డుప్లెసిస్​, అంబటి రాయుడు, ధోనీ వికెట్లను పడగొట్టాడు వరుణ్​ చక్రవర్తి. అదే విధంగా ఈసారి సీఎస్​కేపై వరుణ్ చక్రవర్తి విజృంభించే అవకాశం లేకపోలేదు.

వరుణ్​ చక్రవర్తితో పాటు బౌలింగ్​ దళంలో ఫెర్గ్యూసన్​, ప్రసిధ్​ కృష్ణ బలంగా కనిపిస్తున్నారు. బ్యాటింగ్​ లైనప్​లో ఓపెనర్లు శుభ్​మన్​ గిల్​, వెంకటేశ్​ అయ్యర్​ సూపర్​ ఫామ్​లో ఉన్నారు. యువ బ్యాట్స్​మన్​ వెంకటేశ్​ అయ్యర్​ మరోసారి తన బ్యాట్​తో అద్భుతమైన ప్రదర్శన చేసే అవకాశమూ లేకపోలేదు. ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాహుల్​ త్రిపాఠి అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

ఉత్సాహంలో సీఎస్​కే

ఐపీఎల్​ 2021 పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు.. ఆదివారం కోల్​కతా నైట్​రైడర్స్​తో జరగనున్న మ్యాచ్​లో గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్​లో నెగ్గి ప్లేఆఫ్స్​లో తమ బెర్త్​ ఖరారు చేసుకోవాలని ప్రణాళికలను రచిస్తుంది.

చెన్నై సూపర్​కింగ్స్ జట్టు బ్యాటింగ్ లైనప్​లో బలంగానే ఉందని గత రెండు మ్యాచ్​ల్లో ప్రదర్శన చూస్తే తెలుస్తోంది. ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ రుతురాజ్​ గైక్వాడ్​ తన అద్భుతమైన బ్యాటింగ్​తో జట్టుకు సరైన ఓపెనింగ్​ అందిస్తున్నాడు. అలానే ఫాఫ్​ డుప్లెసిస్​, మొయిన్​ అలీ, అంబటి రాయుడు సురేశ్​ రైనా కూడా ఫామ్​లో ఉన్నారు. మరోవైపు బౌలింగ్​ దళంలో డ్వేన్​ బ్రావో, శార్దూల్​ ఠాకూర్​, దీపక్​ చాహర్​ బలంగా కనిపిస్తున్నారు.

ఆదివారం ఐపీఎల్​లో రెండు మ్యాచ్​లు జరగనున్నాయి. అబుదాబిలోని షేక్​ జాయేద్​ స్టేడియం వేదికగా జరగనున్న తొలిమ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

తుదిజట్లు(అంచనా):

చెన్నై సూపర్ కింగ్స్​: రుతురాజ్​ గైక్వాడ్​, డుప్లెసిస్​, మొయిన్​ అలీ, సురేశ్​ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, హేజిల్​వుడ్​, మహేంద్రసింగ్​ ధోనీ(కెప్టెన్​, వికెట్​ కీపర్​), డ్వేన్​ బ్రావో, శార్దూల్​ ఠాకూర్​, దీపక్​ చాహర్​.

కోల్​కతా నైట్​రైడర్స్​: శుభ్​మన్​ గిల్​, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రానా, ఇయాన్​ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్(వికెట్​ కీపర్​), ఆండ్రూ రసెల్, సునీల్ నరేన్, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిధ్ కృష్ణ.

ఇదీ చూడండి.. IPL 2021: ప్లేఆఫ్​ రేసు నుంచి వైదలొగిన సన్​రైజర్స్​

Last Updated : Sep 26, 2021, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.