ETV Bharat / sports

IPL 2021: యూఏఈలో ఐపీఎల్​ జరిగితే అన్నీ ఇబ్బందులే!

నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్​ మ్యాచుల్ని.. యూఏఈ వేదికగా సెప్టెంబరులో జరపాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే అక్కడ నిర్వహిస్తే, ఎన్నో ఆటంకాలు ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇంతకీ ఆ సమస్యలేంటి? దాని గురించే ఈ ప్రత్యేక కథనం.

CHALLENGES FACED BCCI TO ORGANISE ipl in UAE
ఐపీఎల్
author img

By

Published : May 28, 2021, 10:25 AM IST

Updated : May 28, 2021, 11:41 AM IST

కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ 2021 సీజన్‌ అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 29 మ్యాచ్‌లు పూర్తికాగా ఇంకా 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. వాటిని సెప్టెంబర్‌ మూడో వారంలో యూఏఈలో నిర్వహించాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎందుకంటే ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించకపోతే బీసీసీఐకి ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దాంతో ఎలాగైనా మిగతా మ్యాచ్‌లు పూర్తి చేయాలని పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఒకవేళ అదే జరిగితే.. పలు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అవేంటో ఓసారి తెలుసుకుందాం..

టీమ్‌ఇండియాకు ఇబ్బందికరం..

న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఇప్పటికే ముంబయిలో క్వారంటైన్‌లో ఉన్నారు. జూన్‌ 2న ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లాక అక్కడ మళ్లీ క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ తర్వాత సుమారు 40 రోజుల విశ్రాంతి దొరికినా ఆటగాళ్లంతా బుడగ దాటి బయటకు వెళ్లే వీలులేదు. దాంతో హోటల్‌కే పరిమితమవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ నేపథ్యంలో ఆ పర్యటన మొత్తం ముడున్నర నెలలు సాగనుంది. అనంతరం మూడు వారాల ఐపీఎల్‌, అది ముగిసిన వారం పది రోజులకు టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉండటంతో.. ఎలా చూసినా టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఆరు నెలలు బయోబుడగలో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అది వారికి మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఇబ్బందికరం.

kohli ipl
కోహ్లీ ఐపీఎల్

ఐసీసీకి తలనొప్పి..!

భారత్‌లో ప్రస్తుతం కరోనా రెండో దశ విజృంభిస్తోంది. అది ఐపీఎల్‌ 14వ సీజన్‌పైనా ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన బయోబుడగ ఏర్పాటు చేసినా పలువురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడ్డారు. దీంతో టోర్నీనే వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌ మూడో వారం నుంచి అక్టోబర్‌ 10 వరకు యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఐసీసీకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అక్టోబర్‌, నవంబర్‌ కాలంలో భారత్‌లో కరోనా మూడో దశ తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో టీ20 ప్రపంచకప్‌ను కూడా యూఏఈకి తరలించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఆ నిర్ణయం గనుక తీసుకుంటే ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు అక్టోబర్‌ 1 కల్లా అబుదాబి, షార్జా, దుబాయ్‌ మైదానాలను ఐసీసీకి అప్పగించాల్సి ఉంటుంది. కానీ, మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం అక్టోబర్‌ 10 వరకు బీసీసీఐ ఆ వేదికలను ఖరారు చేసుకునే వీలుంది. అది ఐసీసీకి తలనొప్పిగా మారుతుంది!

.
.

ఈసీబీపై ఒత్తిడి..

ప్రస్తుత పరిస్థితుల్లో ఆసియా దేశాల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీసీసీఐ, పీసీబీ, అఫ్గానిస్థాన్‌ బోర్డులు తమ మ్యాచ్‌లను నిర్వహించేందుకు యూఏఈనే తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దుబాయ్‌, షార్జా, అబుదాబి మైదానాలు జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు తీరిక లేని బిజీ షెడ్యూల్‌తో నిండిపోనున్నాయి. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ కోసం ఇప్పటికే ఆ క్రికెట్‌ బోర్డు జూన్‌ తొలి వారం నుంచి బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆపై అప్ఘానిస్థాన్‌, న్యూజిలాండ్ జట్లతోనూ అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించాలనే ప్రణాళికతో పీసీబీ అడుగులు వేస్తోంది. మరోవైపు అఫ్గానిస్థాన్‌ సైతం ఆగస్టు, సెప్టెంబర్‌ కాలంలో తమ మ్యాచ్‌లు అక్కడే నిర్వహించాలని చూస్తోంది. ఇక బీసీసీఐ సైతం ఐపీఎల్‌ మ్యాచ్‌లను అక్కడే నిర్వహించాలని చూస్తుండటంతో యూఏఈలోని మూడు పిచ్‌లు దెబ్బతినే ప్రమాదం ఉంది. అవి స్లో వికెట్లుగా తయారై బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయలేక ఇబ్బంది పడే వీలుంది. ఇలాంటి పరిస్థితుల్లో యూఏఈపై అధిక భారం పడనుంది.

.
.

బుడగ పేలితే..

ఒకవేళ ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌ రెండు ఈవెంట్లూ యూఏఈలోనే నిర్వహిస్తే ఇంకో ప్రమాదం కూడా పొంచిఉంది. అదే బయెబబుల్‌ పేలడం. ఈ రెండు ఈవెంట్లలో ఏ ఒక్కరు వైరస్‌ బారిన పడినా అది ఆయా టోర్నీల నిర్వహణకే ప్రమాదకరంగా మారనుంది. ఐపీఎల్‌ లాంటి మెగా టోర్నీలో అన్ని ప్రధాన జట్ల కీలక ఆటగాళ్లు పాల్గొంటారనే సంగతి తెలిసింది. దాంతో వారంతా ప్రపంచకప్‌కు ముందే బయోబడుగలో ఉంటారు. కానీ, ఆ రెండు టోర్నీలకు సంబంధించి అనేక మంది ఇతర ఆటగాళ్లు, ఆయా జట్ల సిబ్బంది, వారి కుటుంబాలు సైతం ఇతర దేశాల నుంచి రావాల్సి ఉంటుంది. దాంతో వారందరికీ ప్రత్యేకమైన వసతులు కల్పించాలి. ఆయా జట్లకు ప్రాక్టీస్‌ చేసుకునే ఏర్పాట్లు చేయాలి. ఇదంతా చాలా కష్టతరమైన ప్రక్రియ. గతేడాది ఐపీఎల్‌లో ఎనిమిది జట్లకు సరైన ఏర్పాట్లు చేసినా.. ఈసారి ప్రపంచకప్‌లో 16 జట్లు పాల్గొనే అవకాశం ఉంది. దాంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం అంత తేలిక కాదు. మరోవైపు ఆయా దేశాలకు సంబంధించిన వారికి క్వారంటైన్‌ నిబంధనలు లాంటివి కూడా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో ఏ ఒక్కరు బుడగ దాటినా అది రెండు టోర్నీలకూ ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ, ఐసీసీ, ఈసీబీ ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తాయో చూడలి. అలాగే బీసీసీఐ కూడా ఎలా ముందుకు సాగుతుందో ఆసక్తిగా మారింది.

.
.

ఇవీ చదవండి:

Last Updated : May 28, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.