ఓ జట్టేమో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి టేబుల్ టాప్‌లో ఉంది. మరో జట్టేమో వరుస అపజయాలతో ఇప్పటికే రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. ఆ రెండు జట్లే చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్(csk vs srh). వీటి మధ్య గురువారం(సెప్టెంబరు 30) రాత్రి షార్జా వేదికగా మ్యాచ్ జరగనుంది.
చెన్నై ఇప్పటికే..
ఐపీఎల్ రెండో దశలో భాగంగా యూఏఈలో అడుగుపెట్టిన చెన్నై టీమ్(chennai super kings 2021).. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి, ప్లేఆఫ్స్ దాదాపు ఖరారు చేసుకుంది. ఓపెనర్లు రుతురాజ్, డుప్లెసిస్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. వీరికి తోడు మొయిన్ అలీ, అంబటి రాయుడు, రైనా.. తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
ఆల్‌రౌండర్ జడేజా(jadeja csk).. అటు బ్యాట్, ఇటు బంతితో రాణిస్తున్నాడు. బౌలర్లు కూడా తమ బాధ్యత నిర్వర్తిస్తూ విజయాల్లో భాగమవుతున్నారు. దీంతో హైదరాబాద్ జట్టుపై(csk vs srh) గెలుపు వీరికి పెద్దగా కష్టం కాకపోవచ్చు!
సన్‌రైజర్స్‌కు అవకాశాల్లేవ్ కానీ..!
పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఉన్న హైదరాబాద్ జట్టు(ipl hyderabad team).. దాదాపు ఐదు ఓటముల తర్వాత రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. జట్టులోకి వచ్చిన జేసన్ రాయ్.. మెరుపులతో గెలుపు రుచి చూసింది. ఇప్పుడు చెన్నైపై కూడా గెలిచి దానిని కొనసాగించాలని చూస్తోంది.
రెగ్యూలర్ ఓపెనర్ వార్నర్(warner ipl) లేకపోవడం అభిమానుల్ని నిరాశకు గురిచేస్తోంది. మరోవైపు జట్టు మిడిలార్డర్లో నిలకడలేకపోవడం కూడా కలవరపెడుతోంది. అయితే సన్‌రైజర్స్(csk vs srh) కూడా ప్లేఆఫ్ అవకాశాలు ఉన్నాయి! కానీ అవి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో?