ఐపీఎల్ నిరవధిక వాయిదాతో స్వదేశానికి ఎలా వెళ్లాలో అన్న సందిగ్ధంలో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్‌లు సహా మిగతా సిబ్బందికి ఊరట లభించింది. ప్రత్యేక విమానాల ద్వారా మాల్దీవుల మీదుగా తమ సొంతగూటికి వెళ్లేలా బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది.
భారత్ నుంచి వచ్చే విమాన సేవలను ఆసీస్ ప్రభుత్వం మే 15 వరకు రద్దు చేసింది. అప్పటి వరకు వీరంతా మాల్దీవుల్లోనే ఉంటారని బోర్డు వెల్లడించింది. లీగ్ వాయిదా పడిన రెండు రోజుల్లోనే తమ ఆటగాళ్లను సరక్షితంగా పంపేలా చొరవ తీసుకున్నందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపింది.
ఇటీవల కరోనా సోకిన చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ(ఆసీస్).. ఇంకా వైరస్‌కు సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపింది. అతడు ఫ్రాంచైజీ పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించిండి. అతడిని సురక్షితంగా ఇక్కడి నుంచి పంపేలా బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పింది.
ఇదీ చూడండి: ఎయిర్ అంబులెన్స్‌లో హస్సీ, చివర్లో రాంచీకి ధోనీ'