ETV Bharat / sports

IPL 2021: 'వాళ్లు లేనంత మాత్రాన ఐపీఎల్ ఆగదు' - ఐపీఎల్ యూఏఈ

విదేశీ క్రికెటర్లు పలువురు లేనంత మాత్రాన ఐపీఎల్​కు ఆటంకం ఉండదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు. టీ20 ప్రపంచకప్​పై మరో నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

IPL latest news
కోహ్లీ రోహిత్
author img

By

Published : May 31, 2021, 10:04 PM IST

విదేశీ క్రికెటర్లు అందుబాటులో లేనంత మాత్రాన ఐపీఎల్​ మిగిలిన మ్యాచ్​ల నిర్వహణ ఆగదని బీసీసీఐ(BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్​ సీజన్​లో యూఏఈలో జరపనున్నట్లు ఇటీవల ప్రకటించారు.

"మేం(బీసీసీఐ) విదేశీ ప్లేయర్ల సమస్య గురించి చర్చించనున్నాం. ఈ సీజన్​ పూర్తి చేయడమే మా ప్రస్తుత ప్రధాన లక్ష్యం. మధ్యలో వదిలేయలేం కదా. అందుకే విదేశీ ఆటగాళ్లు ఎవరు వచ్చినా రాకపోయినా మిగిలిన మ్యాచ్​లు జరుగుతాయి. ఒకవేళ అందుబాటులో లేనివాళ్లకు బదులు ఇతర ప్లేయర్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకుంటాయి" అని రాజీవ్ శుక్లా చెప్పారు.

అలానే ఈ మ్యాచ్​లకు ప్రేక్షకుల వచ్చేది లేనిది ఎమిరేట్స్ బోర్డుతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని రాజీవ్ అన్నారు. అలానే టీ20 ప్రపంచకప్​ భారత్​లో జరిపేందుకు ప్రయత్నిస్తామని, జూన్ చివర్లో లేదంటే జులై మొదటి వారంలో అప్పటి పరిస్థితులు చూసి ప్రకటన చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.