ETV Bharat / sports

చెన్నైలో 10 మంది ఆటగాళ్లు.. ఓ కెప్టెన్​: ధోనీపై ఆకాశ్ చోప్రా ట్రోల్

ఐపీఎల్​లో(IPL 2021 News) చెన్నై సూపర్ కింగ్స్​ కెప్టెన్ ధోనీ(ms dhoni news) బ్యాటింగ్ తీరుపై విమర్శలు చేశాడు వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. అలాగే మహీ కెప్టెన్సీ మాత్రం అద్భుతం అంటూ కొనియాడాడు.

MS Dhoni
ధోనీ
author img

By

Published : Sep 30, 2021, 8:25 PM IST

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది చెన్నై సూపర్ కింగ్స్. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. అయితే సీఎస్కే ప్రదర్శన ఎలా ఉన్నా.. కెప్టెన్ ధోనీ(ms dhoni news) మాత్రం బ్యాటింగ్​లో విఫలమవుతున్నాడు. దీంతో పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే వ్యాఖ్యాత ఆకాశా చోప్రా(akash chopra commentary) మహీ ఆటతీరును ట్రోల్ చేశాడు.

"ప్రస్తుతం ధోనీ(ms dhoni news) ఓ కెప్టెన్, వికెట్​ కీపర్​గా మాత్రమే జట్టుకు సేవలందిస్తున్నాడు. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్​లో అతడు దిగువన దిగుతున్నాడు. కొన్ని సార్లు బ్యాటింగ్ వచ్చినా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. దీనిని బట్టి గమనిస్తే ప్రస్తుతం చెన్నై 10 మంది ప్లేయర్స్, ఓ కెప్టెన్​తో ఆడుతోంది."

-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత

ధోనీ(ms dhoni news) బ్యాటింగ్​లో లోయర్ ఆర్డర్​లో రావడం, అతడి బ్యాటింగ్​తో జట్టుకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్లే ఈ కామెంట్స్ చేశాడు ఆకాశ్ చోప్రా. ప్రస్తుత సీజన్​లో ఇప్పటివరకు 10 మ్యాచ్​లు ఆడిన మహీ(ms dhoni news) 10.40 పేలవ సగటుతో కేవలం 52 పరుగులు మాత్రమే సాధించాడు.

అలాగే కెప్టెన్​గా ధోనీ(ms dhoni news) జట్టును నడిపిస్తున్న తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆకాశ్ చోప్రా. "గతేడాది విఫలమైన చెన్నై ఈసారి పుంజుకుంది. వరుస విజయాలు సాధిస్తోంది. దీనికంతటికీ కారణం ధోనీ(ms dhoni news) కెప్టెన్సీనే. ఒకవేళ అతడు కనుక జట్టులో లేకపోతే ఇలాంటి ఫలితాలు వచ్చేవి కావు" అని తెలిపాడు.

ఇవీ చూడండి: టీమ్ఇండియా కోచ్​గా ద్రవిడ్, మెంటార్​గా ధోనీ.. ఇదే జరిగితే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.