ETV Bharat / sports

ఐపీఎల్​ వేదికపై గంగూలీ కీలక ప్రకటన - ఐపీఎల్​ 2022 భారత్​లోనే

IPL 2022 venue ganguly: ఈ ఏడాది ఐపీఎల్​ను భారత్​లోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. అయితే ఈ నిర్ణయం.. లీగ్​ సమయానికి ఉన్న కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అన్నాడు.

IPL 2022 venue
ఐపీఎల్​ గంగూలీ
author img

By

Published : Feb 3, 2022, 2:18 PM IST

IPL 2022 venue ganguly: ఈ సీజన్​ ఐపీఎల్​ వేదికపై వస్తోన్న సందేహాలకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెరదించాడు. టోర్నీ మొత్తం స్వదేశంలోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశాడు. అయితే కరోనా కేసుల పెరుగుదల అంశంపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందని వెల్లడించాడు.

"ఈ ఏడాది ఐపీఎల్​ భారత్​లోనే నిర్వహిస్తాం. అయితే కరోనా విజృంభణ తారస్థాయికి చేరనంత వరకే. మహారాష్ట్రలోని ముంబయి, పుణెలో మ్యాచులు నిర్వహిస్తాం. నాకౌట్​ దశకు త్వరలోనే వేదికను ఖరారు చేస్తాం."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

కాగా, బెంగళూరులో ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఈ సీజన్​ మెగావేలం జరగనుంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 590 మంది క్రికెటర్లు ఈ ఆక్షన్​లో పాల్గొనబోతున్నారు.

ఇదీ చూడండి: IND VS WI: భారత్​-వెస్టిండీస్​ వన్డే సిరీస్​ వాయిదా?

IPL 2022: ఐపీఎల్ మెగా వేలం.. తుది జాబితా ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.