IPL Playoff guidelines: మంగళవారం నుంచి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మొదలవుతున్నాయి. కోల్‌కతా వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్కడ వాతావరణ పరిస్థితులు మ్యాచ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో విజేతలను నిర్ణయించడానికి మార్గదర్శకాలు విడుదల చేశారు నిర్వాహకులు. వీటి ప్రకారం మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయం ఏర్పడితే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తున్నారు. ఫ్లే ఆఫ్స్ మార్గదర్శకాల్లోని మరిన్ని నిబంధనలు ఎలా ఉన్నాయంటే..
- మ్యాచ్ ప్రారంభమయ్యాక వర్షం వల్ల అంతరాయం ఏర్పడితే ఓవర్లను తగ్గిస్తారు. వాన తగ్గాక సమయం ఉంటే కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు.
- ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ సమయం అంతా అయిపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
- ఒకవేళ మ్యాచ్ జరగకపోతే.. ఒక్క బంతి కూడా పడకపోతే పాయింట్ల పట్టికలో స్థానాన్ని బట్టి విన్నర్‌ను నిర్ణయిస్తారు.
- క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు రిజర్వ్ డేలు లేవు. అందుకే ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు నిర్వాహకులు.
- క్వాలిఫయర్ 1, ఎలిమినేటల్ మ్యాచ్‌లు కోలకతా వేదికగా జరుగుతాయి. క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరుగుతాయి
- 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం రిజర్వ్ డే ఉంది. ఒకవేళ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే.. మే 30న తిరిగి అక్కడినుంచే మ్యాచ్‌ను కొనసాగిస్తారు.
ఇదీ చదవండి: టైటాన్స్, రాయల్స్ రసవత్తర పోరు.. ఫైనల్ బెర్తు ఎవరికో..?