ETV Bharat / sports

CSK next captain: 'ధోనీ వారుసుడిగా అతనే సరైనోడు' - సీఎస్​కేకు ధోనీ తర్వాత కెప్టెన్​

చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు తదుపరి కెప్టెన్​గా(CSK next captain) ఆ క్రికెటర్ సరైనోడు అని మాజీ క్రికెటర్​ సైమన్​ డౌల్​ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్​లో గత రెండు సీజన్లలో బ్యాటుతో రాణిస్తున్న ఆ బ్యాటర్.. ధోనీ వారసుడు అవుతాడని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే?

next captain of Chennai Super Kings
సీఎస్​కే కెప్టెన్​ ధోనీ
author img

By

Published : Nov 29, 2021, 9:20 AM IST

చెన్నై సూపర్​ కింగ్స్​(సీఎస్​కే) తదుపరి కెప్టెన్(CSK next captain after Dhoni)​ ఎంపికపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్​ డౌల్​. ఎంఎస్​ ధోనీ నుంచి కెప్టెన్​ బాధ్యతలు స్వీకరించడానికి డుప్లెసిస్ ​సరైనోడు అని అన్నాడు.

2008లో ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్​కేకు కెప్టెన్​గా చేస్తున్న ధోనీ.. జట్టును 14వ సీజన్​ వరకు అత్యంత విజయంగా నడిపించాడు. తన సారథ్యంలో సీఎస్‌కేను తొమ్మిదిసార్లు ఫైనల్స్‌కు చేర్చాడు. నాలుగు సార్లు కప్‌ గెలుచుకున్నాడు. అందులో ఐపీఎల్ -2021 టైటిల్‌ కూడా ఉంది. అయితే తన చివరి టీ20 మ్యాచ్‌ను చెన్నైలోనే ఆడతానని ఇటీవల చెప్పాడు. దీంతో ధోనీ(ms dhoni ipl retirement) మరో సీజన్​ సీఎస్​కే సారథిగా కొనసాగుతాడా లేదా అన్నది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. సీఎస్​కేకు ధోనీ తర్వాత కెప్టెన్​ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ తరుణంలో ధోనీ వారసుడిగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ సరిపోతాడని డౌల్​ అన్నాడు. ఐపీల్​లో గత రెండు సీజన్లలో డుప్లెసిస్ బ్యాటుతో చెలరేగిపోయాడు. జట్టుకు కావాల్సిన సమయంలో రాణించాడు. 14వ సీజన్‌లో 16 మ్యాచ్​లు ఆడిన డుప్లెసిస్​ 633 పరుగులతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

"ధోనీ తన చివరి మ్యాచ్​ ఆడాలని నిర్ణయించుకుంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో డుప్లెసిస్ కెప్టెన్సీ(CSK next captain after Dhoni) బాధ్యతలు చేపతాడు. అదే నా అభిప్రాయం. ధోనీ ఆ సీజన్ మొత్తం ఆడుతాడని నేను భావించట్లేదు. అయితే చెన్నైలోనే ధోనీ చివరి ఐపీఎల్‌ టీ20 మ్యాచ్‌ను ప్రకటిస్తారు. అక్కడ నుంచి డుప్లెసిస్​ బాధ్యతలు స్వీకరిస్తాడు" అని సైమన్​ డౌల్​ అన్నారు.

మరోవైపు సీఎస్​కే ఏ ఆటగాళ్లను రిటైన్​ చేసుకోవాలన్న దానిపై మాట్లాడిన డౌల్​.. ధోనీ, డుప్లెసిస్​తో పాటు జడేజా, రుతురాజ్ గైక్వాడ్​ను కొనసాగించాలన్నారు.

"రవీంద్ర జడేజా మిస్టర్ చెన్నై. అతడ్ని అలాగే ఉంచుకోవాలి. రుతురాజ్ గైక్వాడ్ ప్రదర్శన బాగుంది. అతన్ని తప్పక కొనసాగించాలని నేను భావిస్తున్నాను. అతన్ని వదులుకోకుండా డుప్లెసిస్-గైక్వాడ్​ ఓపెనింగ్​ జోడిని కొనసాగించాలి" అని డౌల్​ అభిప్రాయపడ్డాడు.

ఇవీ చూడండి:

వచ్చే ఐపీఎల్​లో ఆడటంపై ధోనీ ఏమన్నాడంటే?

PBKS IPL 2022: రాహుల్ ఎఫెక్ట్.. ఒక్కరూ వద్దంటున్న పంజాబ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.