IPL New Rule : ఐపీఎల్ 2024 సీజన్ నుంచి బీసీసీఐ టోర్నీలో కొత్త నిబంధన తీసుకురాన్నట్లు తెలుస్తోంది. ఇకపై ఒక ఓవర్లో బౌలర్ అత్యధికంగా రెండు బౌన్సర్లు సంధించవచ్చు. ఇదివరకు ఓవర్లో ఒకే బౌన్సర్‌ను అనుమతించేవారు. ఇక అదే ఓవర్లో మరో బంతిని బౌన్సర్‌గా సంధింస్తే, దానిని వైడ్‌గా ప్రకటించేవారు. తాజా రూల్‌తో ఇప్పటినుంచి బౌలర్లకు ఆ సమస్య లేదు. స్వేచ్ఛగా రెండు బౌన్సర్లు వేసుకోవచ్చు. అయితే బ్యాటర్- బౌలర్ మధ్య పోటీని పెంచే ఉద్దేశంతోనే ఈ రూల్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఈ నిబంధనను అమలు చేసింది బీసీసీఐ.
ఇక ఈ రూల్ బౌలర్లకు బాగా కలిసొస్తుందని టీమ్ఇండియా స్టార్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ తెలిపాడు. 'ఈ రూల్ వల్ల క్రీజులో బౌన్సర్లు ఎదుర్కొనడానికి బ్యాటర్లు మరింత కష్టపడాలి. ఇదివరకు ఓవర్లో ఒకే బౌన్సర్ అన్న ధీమాతో బ్యాటింగ్ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. క్రికెట్లో ఇది చిన్న మార్పే అయినా, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ రూల్ బౌలర్లకు ఓ ఆయుధం లాంటిది. ఇలాంటి రూల్ ఉండడం ఇంపార్టెంట్ అని ఓ బౌలర్‌గా నా భావన' అని ఉనాద్కత్ అన్నాడు.
-
IPL 2024 Set To Witness This New Rule To Benefit Fast Bowlershttps://t.co/Wvf3xeNsy4
— vekku official (@Vekkuofficial) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">IPL 2024 Set To Witness This New Rule To Benefit Fast Bowlershttps://t.co/Wvf3xeNsy4
— vekku official (@Vekkuofficial) December 19, 2023IPL 2024 Set To Witness This New Rule To Benefit Fast Bowlershttps://t.co/Wvf3xeNsy4
— vekku official (@Vekkuofficial) December 19, 2023
గతేడాది ఇంపాక్ట్ రూల్ : 2023 ఐపీఎల్‌లోనూ 'ఇంపాక్ట్ ప్లేయర్' పేరుతో కొత్త రూల్‌ను తీసుకువచ్చింది బీసీసీఐ. టాస్ సమయంలోనే 11 మంది తుది జట్టుతోపాటు మరో నలుగురు సబ్సిట్యూట్ ప్లేయర్లను ప్రకటించాలి. ఈ ప్లేయర్లు మ్యాచ్ జరుగుతుండగా గేమ్ మధ్యలో ఇంపాక్ట్‌గా బరిలో దిగవచ్చు. అయితే తుది జట్టులో అప్పటిరే 4గురు ఫారిన్ ఆటగాళ్లు ఉంటే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా కచ్చితంగా భారత ప్లేయరే బరిలోకి దిగే ఛాన్స్ ఉంటుంది. కానీ, ఈ నిబంధనతో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం తగ్గుతుందని విమర్శలు వచ్చాయి. కాగా,ఈ రూల్ అప్పటికే ఆస్ట్రేలియా డొమెస్టిక్ టీ20 టోర్నీ బిగ్‌బాష్ లీగ్, భారత డొమెస్టిక్ లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో లో స్టార్ట్ చేశారు.
ఆసక్తి రేపుతున్న IPL వేలం- రూ. కోట్లు కొల్లగొట్టే ప్లేయర్లు వీళ్లే!
నవీన్ ఉల్ హక్‌పై నిషేధం- 20నెలలు టోర్నీ నుంచి బ్యాన్- కారణం ఏంటంటే?