ETV Bharat / sports

రూ.1.27 లక్షల కోట్లకు ఐపీఎల్ విలువ.. నెంబర్ 1 టీమ్ ఏదో తెలుసా? - ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ 26 వేల కోట్లు

IPL brand value 2023: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌).. విలువ పరంగా హద్దులను చెరిపేస్తూ ముందుకెళ్తోంది. దాన్ని బ్రాండ్ విలువ భారీ స్థాయికి చేరుకుంది. ఆ వివరాలు..

IPL brand value
రూ.1.27 లక్షల కోట్లకు ఐపీఎల్ విలువ.. నెంబర్ 1 టీమ్ ఏదో తెలుసా?
author img

By

Published : Jul 11, 2023, 7:51 AM IST

IPL brand value 2023: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్​ వైడ్​గా ఈ లీగ్​కు ఉన్నంత క్రేజ్ ఇతర ఏ లీగ్​కు లేదు.​ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు.. ఈ మెగా టోర్నీ కోసం రెండు నెలల పాటు టీవీలు, సెల్​ఫోన్లకు అత్తుక్కుపోతారు. సిక్సులు, ఫోర్లతో ధనాధన్​ బ్యాటింగ్​, కళ్లు చెదిలే ఫీల్డింగ్ విన్యాసాలు, మెరుపు వేగంతో బౌలింగ్​.. అబ్బో క్రికెట్​ అభిమానులను తెగ అలరిస్తుంది ఈ లీగ్​.

2008లో ప్రారంభమైన ఈ లీగ్​ ప్రతీ ఏడాది.. విశేష ఆదరణ, ఆదాయాన్ని అందుకుంటూ.. విలువ పరంగా హద్దులను చెరిపేస్తూ ముందుకెళ్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ ఏకంగా సుమారు 3.2 బిలియన్‌ అమెరికా డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో రూ.26,432 కోట్లు. ఈ విషయాన్ని తెలుపుతూ.. అమెరికాకు చెందిన బహుళజాతి స్వతంత్ర పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ హౌలిహన్‌ లోకీ ఓ నివేదికను విడుదల చేసింది.

అంతకుముందు ఈ బ్రాండ్ విలువ దాదాపు దాదాపు 1.8 బిలియన్‌ అమెరికా డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో రూ.14,868 కోట్లు. అంటే ఒక్క ఏడాదిలోనే ఐపీఎల్‌ విలువ వృద్ధి రేటు దాదాపుగా 80 శాతం నమోదైంది. ఈ లీగ్‌ వ్యాపార సంస్థ వ్యాల్యూ కూడా 80 శాతం వృద్ధి రేటు అందుకుంది. రూ.70,212 కోట్ల నుంచి రూ.1.27 లక్ష కోట్లకు చేరింది.

మీడియా రైట్స్​లో అదే టాప్​.. ఇక 2023-27 కాలానికి గాను ఐపీఎల్‌ మీడియా రైట్స్ విలువ రూ.48,390 కోట్లు. వయాకామ్‌ 18, డిస్నీ స్టార్‌ కలిపి ఈ భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేశాయి. అందుకే ఈ లీగ్‌ విలువ ఇంతలా పెరిగింది. 2017తో పోలిస్తే 2023 మీడియా రైట్స్​ వార్షిక వృద్ధి రేటు 196 శాతంగా నమోదైంది. అంటే ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌కు బ్రాడకాస్టర్లు చెల్లించే మొత్తం.. అమెరికా జాతీయ బాస్కెట్‌బాల్‌ సంఘం (ఎన్‌బీఏ), ఇంగ్లిష్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌), బుండెస్‌లిగా కన్నా ఎక్కువగా ఉండటం విశేషం. అయితే ఈ జాబితాలో అమెరికా జాతీయ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) అందరికన్నా ముందుంది. ఇదొక్కట్టే ఐపీఎల్‌ కన్నా ముందు స్థానంలో నిలిచింది.

ఇక ఐపీఎల్‌లో జట్లు పరంగా చూస్తే చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఎస్కే బ్రాండ్‌ విలువ దాదాపు రూ.1751 కోట్లు ఉంది. ఇక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.1610 కోట్లు, ముంబయి ఇండియన్స్‌ రూ.1569 కోట్లు, రాజస్థాన్‌ రాయల్స్‌ బ్రాండ్‌ విలువ వరుసగా రూ.991 కోట్లు.

ఇదీ చూడండి :

ఆ స్టార్ ప్లేయర్స్​ కోసం ఐపీఎల్​ ఫ్రాంచైజీలు మాస్టర్ ప్లాన్​!

సంపాదనలోనూ 'కోహ్లీ' కింగే.. ఏడాదికి అన్ని వందల కోట్లా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.