IPL Auction 2024 Strac Cummins : దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు చరిత్ర సృష్టించారు. ఇంతవరకు ఏ ఆటగాడు కూడా రూ.20 కోట్లకుపైగా కొల్లగొట్టలేదు. ఈసారి వేలంలో సన్స్‌రైజర్స్ హైదరాబాద్ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లకు దక్కించుకున్నాయి. ఇలా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కడంపై ఆసీస్ ప్లేయర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
'ఆ నమ్మకం ఉంది'
Mitchell Starc Reaction : మిచెల్ స్టార్క్ కోసం దిల్లీ, ముంబయి, గుజరాత్, కోల్‌కతా తీవ్రంగా పోటీ పడ్డాయి. కేకేఆర్ మాత్రం చివరి వరకు ఎక్కడా తగ్గకుండా ఈ యార్కర్ల కింగ్‌ను దక్కించుకుంది. ఈ విషయంపై స్టార్క్ స్పందించాడు. "నిజంగా షాక్‌కు గురయ్యాను. ఇంత మొత్తాన్ని అసలు ఊహించలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్‌లో మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు విలువ పెరిగినా నా ఆటతీరు మారలేదు. భారీ మొత్తం దక్కడం అంటే ఒత్తడి ఉండటం సహజమే అయినా నాకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉంది" అని స్టార్క్ తెలిపాడు.
-
We won, Mr. Starc! 💜 pic.twitter.com/twJ3VmCPDl
— KolkataKnightRiders (@KKRiders) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">We won, Mr. Starc! 💜 pic.twitter.com/twJ3VmCPDl
— KolkataKnightRiders (@KKRiders) December 19, 2023We won, Mr. Starc! 💜 pic.twitter.com/twJ3VmCPDl
— KolkataKnightRiders (@KKRiders) December 19, 2023
-
Welcome back, record-breaker! 🫡 pic.twitter.com/KwSZui8GBj
— KolkataKnightRiders (@KKRiders) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Welcome back, record-breaker! 🫡 pic.twitter.com/KwSZui8GBj
— KolkataKnightRiders (@KKRiders) December 19, 2023Welcome back, record-breaker! 🫡 pic.twitter.com/KwSZui8GBj
— KolkataKnightRiders (@KKRiders) December 19, 2023
'హైదరాబాద్ అంటే నాకు ఇష్టం'
Pat Cummins Reaction : ఈ మినీ వేలంలో రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వచ్చిన కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ ధరకే సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర సొంతం చేసుకున్న రెండో ఆటగాడిగా కమిన్స్ రికార్డులకెక్కాడు. ఈ విషయంపై అతడు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. "సన్‌రైజర్స్‌తో జత కట్టేందుకు ఉత్సాహంతో ఉన్నా. ఆరెంజ్ ఆర్మీ గురించి చాలా విన్నా. హైదరాబాద్‌లో కూడా మ్యాచ్‌లు ఆడాను. నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నాతో పాటు హెడ్ కూడా ఉన్నాడు. విజయాలతో సీజన్ సాగాలని ఆశిస్తున్నా" అని కమ్మిన్స్ పేర్కొన్నాడు.
-
PAT your backs, Hyd. We’re HEADing towards glory 🧡#HereWeGOrange pic.twitter.com/0nOwwkcyg2
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">PAT your backs, Hyd. We’re HEADing towards glory 🧡#HereWeGOrange pic.twitter.com/0nOwwkcyg2
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023PAT your backs, Hyd. We’re HEADing towards glory 🧡#HereWeGOrange pic.twitter.com/0nOwwkcyg2
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023
-
𝑻𝒉𝒊𝒔 𝒍𝒊𝒕𝒕𝒍𝒆 PAT 𝒐𝒇 𝒍𝒊𝒇𝒆 𝒊𝒔 𝒄𝒂𝒍𝒍𝒆𝒅 𝑯𝒂𝒑𝒑𝒊𝒏𝒆𝒔𝒔 🧡
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Welcome, Cummins! 🫡#HereWeGOrange pic.twitter.com/qSLh5nDbLM
">𝑻𝒉𝒊𝒔 𝒍𝒊𝒕𝒕𝒍𝒆 PAT 𝒐𝒇 𝒍𝒊𝒇𝒆 𝒊𝒔 𝒄𝒂𝒍𝒍𝒆𝒅 𝑯𝒂𝒑𝒑𝒊𝒏𝒆𝒔𝒔 🧡
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023
Welcome, Cummins! 🫡#HereWeGOrange pic.twitter.com/qSLh5nDbLM𝑻𝒉𝒊𝒔 𝒍𝒊𝒕𝒕𝒍𝒆 PAT 𝒐𝒇 𝒍𝒊𝒇𝒆 𝒊𝒔 𝒄𝒂𝒍𝒍𝒆𝒅 𝑯𝒂𝒑𝒑𝒊𝒏𝒆𝒔𝒔 🧡
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023
Welcome, Cummins! 🫡#HereWeGOrange pic.twitter.com/qSLh5nDbLM
ఆసీస్ ప్లేయర్ల ఐపీఎల్ కేరీర్
కమిన్స్‌కు గతంలో ఐపీఎల్లో ఆడిన అనభవం ఉంది. దిల్లీ తరపున 12, కోల్‌కతా తరుపున 30 మ్యాచ్‌లు ఆడి మొత్తం 45 వికెట్లు తీశాడు. 2020 వేలంలో కేకేఆర్ అతడికి రూ.15.50 కోట్లు ఇచ్చింది. 2023లో అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా కమిన్స్ ఆడలేదు. ఇక మిచెల్ స్టార్క్ 27 ఐపీఎల్ మ్యాచ్‌లలో 34 వికెట్లు పడగొట్డాడు. 2014, 2015 సీజన్లలో ఆర్సీబీ తరపున స్టార్క్ ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల ఎనిమిది సీజన్లకు దూరంగా ఉన్నాడు. 2018లో కోల్‌కతా కొనుగోలు చేసినా గాయం కారణంగా టోర్నీకి ముందే తప్పుకున్నాడు. మరీ ఈ సీజన్లో ఈ ఇద్దరు ఏ విధంగా అదరగొడతారో చూడాలి.
స్టార్క్‌పై కాసుల వర్షం- ఐపీఎల్ రికార్డులన్నీ బద్దలు- రూ. 24.75 కోట్లకు KKR కైవసం
ఆల్‌టైమ్ రికార్డ్ ప్రైజ్- వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ రాకతో SRHలో నయా జోష్