ETV Bharat / sports

IPL ఫ్యాన్స్​కు గుడ్​​న్యూస్​.. 4K క్లారిటీతో మ్యాచ్​లన్నీ ఫ్రీగా చూసేయొచ్చు! - ipl 2023 viacom 18

ఐపీఎల్‌ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​. ఈ సారి మ్యాచ్​లన్నింటినీ ఫ్రీగా చూసేయొచ్చు. అవును మీరు చదివింది నిజమే. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని వయాకామ్‌ 18 మీడియా లిమిటెడ్‌..4కే రెజల్యూషన్​లో ఉచితంగానే ప్రసారం చేయనుందట.

ipl-stream-for-free-after-in-jio-cinema
ipl-stream-for-free-after-in-jio-cinema
author img

By

Published : Feb 22, 2023, 2:02 PM IST

మన దేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. చాలా మంది క్రికెట్‌ అభిమానులు ప్రత్యేకంగా ఐపీఎల్​ కోసమే.. మ్యాచ్​లు ప్రసారమయ్యే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటుంటారు. కానీ ఈసారి ఆ అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్​ మ్యాచ్​లను.. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని వయాకామ్‌ 18 మీడియా లిమిటెడ్‌ ఉచితంగానే ప్రసారం చేయనుందట. ఈ విషయాన్ని వయాకామ్​ ప్రతినిధులు తెలిపారు.

అయితే.. ఇప్పటి వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూడడం కోసం ఫ్యాన్స్​.. డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉండేది. కానీ, ఈసారి జియో సినిమా యాప్‌లో మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం కానున్నాయట. ఇటీవల ముగిసిన ఫిఫా ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ తరహాలోనే అభిమానులు ఐపీఎల్‌ మ్యాచ్‌లను సైతం వీక్షించొచ్చట. పైగా తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, మరాఠీ, గుజరాతీ, బెంగాళీ, భోజ్‌పురీ సహా మొత్తం 12 భారతీయ భాషల్లో కామెంటరీ కూడా ఉండనుందట. మ్యాచ్‌, ఆటగాళ్ల గణాంకాలతో పాటు పిచ్‌పై విశ్లేషణ వంటి వివరాలు.. తెరపై మనం ఎంచుకున్న భాషలో కనిపిస్తాయట.

ఫిఫా వరల్డ్‌ కప్‌ జరుగుతున్న సమయంలో చాలా మంది అభిమానులు జియో సినిమా స్ట్రీమింగ్‌ క్వాలిటీపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ సారి సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. మ్యాచ్‌లన్నింటినీ 4కే రెజల్యూషన్‌ (అల్ట్రాహెచ్‌డీ)లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా వయాకామ్‌ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దాదాపు 50 కోట్ల మంది ఐపీఎల్‌ను వీక్షించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఐపీఎల్‌ 2023 సీజన్‌ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు ఎనిమిదివారాల పాటు ఈ టోర్నీ కొనసాగనుంది. మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.