ఐపీఎల్ 2023 సీజన్ కోసం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. మొదటి సీజన్‌లో టర్కోయిష్ బ్లూ గ్రీన్‌లో ఉన్న జెర్సీలను ధరించిన జట్టు సభ్యులు.. ఈసారి ముదురు నీలం రంగు జెర్సీలు వేసుకుని మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. మంగళవారం జరిగిన ఓ ఈవెంట్లో ఈ కొత్త జెర్సీని లఖ్‌నవూ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, మెంటార్ గౌతమ్ గంభీర్ పాల్గొన్నారు.
"కొత్త రంగు.. నూతనోత్సాహం.. కొంగొత్త ఆశలు.. సరికొత్త శైలి" అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ జెర్సీ పై అభిమానులు సామాజిక వేదికలో కామెంట్లు పెడుతున్నారు. "కొత్త జెర్సీ చూసిన తర్వాత పాత జెర్సీపై మమకారం పెరిగిపోయింది. ఎందుకంటే.. కొత్తది మరీ చెత్తగా ఉంది" అంటూ సోషల్ మీడియా వేదికగా భారీ సెటైర్లు వేస్తున్నారు. మరి కొందరేమో 'దిల్లీ క్యాపిటల్స్ 2013 జెర్సీతో పోలుస్తూ దానికి దీనికి పెద్దగా తేడా ఏం లేదంటూ' డిజైనర్‌ను తిట్టి పోస్తున్నారు.
-
𝑵𝒂𝒚𝒂 𝑹𝒂𝒏𝒈, 𝑵𝒂𝒚𝒂 𝑱𝒐𝒔𝒉, 𝑵𝒂𝒚𝒊 𝑼𝒎𝒆𝒆𝒅, 𝑵𝒂𝒚𝒂 𝑨𝒏𝒅𝒂𝒂𝒛 👕💪#JerseyLaunch | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/u3wu5LqnjN
— Lucknow Super Giants (@LucknowIPL) March 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝑵𝒂𝒚𝒂 𝑹𝒂𝒏𝒈, 𝑵𝒂𝒚𝒂 𝑱𝒐𝒔𝒉, 𝑵𝒂𝒚𝒊 𝑼𝒎𝒆𝒆𝒅, 𝑵𝒂𝒚𝒂 𝑨𝒏𝒅𝒂𝒂𝒛 👕💪#JerseyLaunch | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/u3wu5LqnjN
— Lucknow Super Giants (@LucknowIPL) March 7, 2023𝑵𝒂𝒚𝒂 𝑹𝒂𝒏𝒈, 𝑵𝒂𝒚𝒂 𝑱𝒐𝒔𝒉, 𝑵𝒂𝒚𝒊 𝑼𝒎𝒆𝒆𝒅, 𝑵𝒂𝒚𝒂 𝑨𝒏𝒅𝒂𝒂𝒛 👕💪#JerseyLaunch | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/u3wu5LqnjN
— Lucknow Super Giants (@LucknowIPL) March 7, 2023
'స్ట్రైక్ రేట్‌పై అతిగా అంచనా వేస్తున్నారు'..
కాగా త్వరలో ఐపీఎల్ మొదలు కానున్న వేళ టీ20 ఫార్మాట్‌లో స్ట్రైక్‌రేట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. దీనిపై టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రత్యేకంగా స్పందించాడు. స్ట్రైక్‌రేట్‌పై అందరూ అతిగా అంచనా వేస్తున్నారని వ్యాఖ్యానించాడు. "ఫార్మాట్ ఏదైనా సరే స్ట్రైక్‌రేట్ కీలకమే. కానీ, దానినే ఆధారంగా చేసుకుని అతిగా చెప్పడం సరైంది కాదు. ఇదే మాట గతంలోనూ చెప్పా. పరిస్థితిని బట్టి స్ట్రైక్‌రేట్ మారిపోతూ ఉంటుంది. మీరు ఒక మ్యాచ్‌లో 140 పరుగులనే ఛేదించాల్సి వచ్చిందనుకోండి.. అప్పుడు 200 స్ట్రైక్‌రేట్ అవసరం లేదు. అందుకే, మ్యాచ్ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ దూకుడుగా చేయాల్సి ఉంటుంది" అని చెప్పాడు.
మరోవైపు గత కొంత కాలంగా భారత్ తరఫున గొప్పగా రాణించలేకపోతున్న కేఎల్ రాహుల్‌పై ఆసీస్‌తో మూడో టెస్టులో వేటు పడింది. అయితే, అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ కూడా గొప్పగా ఏమీ రాణించలేదు. దీంతో నాలుగో టెస్టులో రాహుల్‌కు చోటు కల్పించాలనే డిమాండ్లూ వస్తున్నాయి.
అయితే ఐపీఎల్-2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన లఖ్‌నవూ జెయింట్స్.. 14 మ్యాచ్‌లకు గానూ తొమ్మిది మ్యాచుల్లో గెలిచింది. ప్లే ఆఫ్‌కు అర్హత సాధించినప్పటికీ టైటిల్ రేసులో మాత్రం వెనకబడింది. మరోవైపు లక్నో జెయింట్స్‌తో పాటు ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. అరంగేట్ర సీజన్‌లోనే ట్రోఫీ సాధించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.