ETV Bharat / sports

IPL 2023: గ్రాండ్​గా ఐపీఎల్ షురూ.. టాస్​ గెలిచిన గుజరాత్.. CSK బ్యాటింగ్​

author img

By

Published : Mar 31, 2023, 7:14 PM IST

Updated : Mar 31, 2023, 7:50 PM IST

ఐపీఎల్​ 16వ ఎడిషన్​ గ్రాండ్​గా ప్రారంభమైంది. తొలి మ్యాచ్​ గుజరాత్​ టైటాన్స్​-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన గుజరాత్​ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్​కు దిగనుంది.

IPL 2023 Chennai Super Kings VS Gujarat Titans
IPL 2023: గ్రాండ్​గా ఐపీఎల్ షురూ..

ఐపీఎల్​ 2023 ఎడిషన్ గ్రాండ్​గా ప్రారంభమైపోయింది. అహ్మాదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ​ గుజరాత్​ టైటాన్స్​-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్​తో ఈ సీజన్ ఆరంభంకానుంది. ఈ సందర్భంగా అభిమానులతో నరేంద్ర మోదీ స్టేడియం నిండిపోయింది. అయితే ఈ మ్యాచ్​లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన గుజరాత్​.. ఫస్ట్​ ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్​ బ్యాటింగ్​కు దిగనుంది.

గుజరాత్​ జట్టు: హార్దిక్ పాండ్య (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, శుభమన్​ గిల్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మహ్మద్​ షమి, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్

ఇంపాక్ట్ ప్లేయర్స్: సాయి సుదర్శన్​, జయంత్ యాదవ్,​ అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, కేఎస్ భరత్​

చెన్నై సూపర్ కింగ్స్: ధోనీ(కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, రాజ్యవర్ధన్ హంగార్గేకర్​.

ఇంపాక్ట్ ప్లేయర్స్: సుభ్రాంశు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, షేక్​ రషీద్​, అజింక్యా రహానే, నిశాంత్ సింధు

గ్రాండ్​గా ప్రారంభోత్సవ వేడుక.. ఐపీఎల్ -16 సీజన్ ఆరంభ వేడుకలు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సీనియర్​ నటి మందిరా బేడి ఐపీఎల్‌ యాంకర్‌గా పునరాగమనం చేసింది. ఈ ఆరంభ వేడుకులకు ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ప్రముఖ సింగర్​ అర్జిత్ సింగ్ తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపిస్తున్నాడు. ఆడియెన్స్​లో ఫుల్​ జోష్​ నింపుతున్నాడు. కాగా, కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరగలేదు. దీంతో ఈ సారి ప్రారంభోత్సవాన్ని అదిరేలా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ఈ ఆరంభ వేడుకలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా హాజరయ్యారు.

ఇక హీరోయిన్​ రష్మిక మంధాన, తమన్నా స్టేజ్​పై తెలుగు పాటలకు చిందులేసి ఆడియెన్స్​లో జోష్ నింపారు. 'పుష్ప' సినిమాలోని 'సామి సామీ', 'శ్రీ వల్లి' పాటలకు అదిరిపోయే స్టెప్పులేసింది రష్మిక. 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటకు కూడా నృత్యం చేసి అలరించింది. మరో హీరోయిన్​ తమన్న భాటియా.. వివిధ భాషల పాటలకు డ్యాన్స్​ చేస్తూ.. ప్రేక్షకులను తెగ అలరించింది. టాలీవుడ్ సినిమా 'పుప్ప'లోని 'ఊ అంటావా మావ' పాటకు చిందులేసింది.

కామెంటేటర్​గా బాలయ్య.. నందమూరి బాలకృష్ణ.. ఈ ఐపీఎల్ 2023 ఓపెనింగ్ మ్యాచ్ కోసం కామెంటేటర్ అవతారం ఎత్తారు. ఇందుకోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ బాక్స్​కు చేరుకున్నారు. ఓ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ కోసం బాలయ్య కామెంటేటర్​గా మారడం ఇదే తొలిసారి.

  • మ్యాన్ ఆఫ్ ది మాసస్ మన లెజెండ్ బాలయ్య 🦁 గారు స్టుడియో లో సందడి మొదలుపెట్టేశారు 🥳💥

    మరింత #AataUnstoppable ఎంటర్టైన్మెంట్ కోసం, ఇంక లేట్ చెయ్యకుండా వెంటనే #StarSportsTelugu/HD & #MaaMovies పెట్టేయండి!! #IPLonStar #HusharuOn #GameOn 🔥 pic.twitter.com/p1IfpRHFLn

    — StarSportsTelugu (@StarSportsTel) March 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: IPL 2023: కెప్టెన్స్​ సూపర్ క్రేజ్​.. ధోనీ రూ.1030 కోట్లు.. మిగతా సారథుల వ్యాల్యూ తెలుసా?

Last Updated : Mar 31, 2023, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.