ETV Bharat / sports

ఐపీఎల్ ఫ్యాన్స్ గెట్​ రెడీ.. మార్చి 26 నుంచి మ్యాచ్​లు - ipl match schedule

ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. ఐపీఎల్ ప్రారంభ-చివరి తేదీలను వెల్లడించారు. త్వరలో పూర్తి షెడ్యూల్​ రిలీజ్ చేస్తామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ చెప్పారు.

ipl 2022
ఐపీఎల్ 2022
author img

By

Published : Feb 24, 2022, 9:28 PM IST

Updated : Feb 24, 2022, 9:41 PM IST

ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్​న్యూస్. మార్చి 26 నుంచి మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయమై గురువారం జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మే 29న ఈ సీజన్​ ముగుస్తుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ పేర్కొన్నారు.

ipl trophy
ఐపీఎల్ ట్రోఫీ

ఈసారి ఐపీఎల్ మ్యాచులు మొత్తం.. మహారాష్ట్రలోనే జరగనున్నాయి. ఇందులో భాగంగా ముంబయిలో 55, పుణెలో 15 మ్యాచ్​ల్ని నిర్వహిస్తారు. వీటిలో వాంఖడే 20, బ్రబోర్న్ 20, డీవై పాటిల్ స్టేడియం 15, ఎమ్​సీఏ గ్రౌండ్​ 15 మ్యాచ్​ల​కు ఆతిథ్యం ఇవ్వనుంది.

అయితే ఈసారి టోర్నీని ప్రేక్షకుల సమక్షంలోనే నిర్వహిస్తామని బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది 25 లేదా 50 శాతం ఉండొచ్చని అన్నారు.

ఈసారి ఐపీఎల్​లో రెండు కొత్త జట్లు గుజరాత్​ టైటాన్స్, లక్నో సూపర్​జెయింట్స్ కూడా చేరాయి. గత సీజన్లతో పోలిస్తే మ్యాచ్​ల సంఖ్య కూడా పెరిగింది. త్వరలో ఈ సీజన్​ పూర్తి షెడ్యూల్​ను రిలీజ్ చేస్తామని బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు.

ipl 2022 teams
ఐపీఎల్ 2022 జట్లు

ఇవీ చదవండి:

Last Updated : Feb 24, 2022, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.