ETV Bharat / sports

ఐపీఎల్​లో 25% ప్రేక్షకులకు అనుమతి- మార్చి 8న ముంబయికి జట్లు - ఐపీఎల్​ 2022

IPL 2022: ఐపీఎల్​ నిర్వహణపై బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో బీసీసీఐ చర్చించింది. మొదటి దశకు 25 శాతం ప్రేక్షకులను అనుమతిచ్చింది. మరోవైపు ఐపీఎల్ జట్లన్నీ మార్చ 8లోపు ముంబయి చేరుకుంటాయి. 14నుంచి సాధన ప్రారంభిస్తాయి.

25 percentage is accept for ipl
ఐపీఎల్​కు 25 శాతం ప్రేక్షకులకు అనుమతి
author img

By

Published : Mar 2, 2022, 7:26 PM IST

IPL 2022: ఐపీఎల్​ 2022లో 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తూ​ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల్ని బట్టి ఈ సంఖ్యను పెంచుతామని తెలిపింది. మార్చి 14,15 నుంచి జట్లన్నీ ప్రాక్టీస్​ను ప్రారంభిస్తాయని వెల్లడించింది. ఐపీఎల్​ నిర్వహణపై బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో బీసీసీఐ సమావేశమైంది.

"ఐపీఎల్​లో పాల్గొనే పది జట్లు వారి సిబ్బంది మార్చి 8 లోపు ముంబయికి చేరుకుంటాయి. 14-15 మధ్య ప్రాక్టీస్​ను ప్రారంభిస్తాయి. టోర్నీలో పాల్గొనే వారంతా బయోబబుల్​కు ముందు 3 నుంచి 5 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్​లో ఉంటారు.​ ముంబయి ప్రయాణానికి 48 గంటల ముందే ఆర్​టీపీసీఆర్​ పరీక్ష చేయించుకోవాలి. 5 రోజుల క్వారంటైన్​లో మూడుసార్లు పరీక్ష చేస్తాం. మొదటి రోజు ఒకటి, రెండో రోజు మరొకటి, చివరి రోజు కూడా పరీక్షలు చేస్తాం. ఈ మూడు పరీక్షల్లో నెగటివ్​ వచ్చిన వారిని క్వారంటైన్​ నుంచి విడుదల చేస్తాం. ప్రతి జట్టు ముంబయి, పుణెలోని నాలుగు వేదికల్లోనే ఆడతాయి. వారి ప్రాక్టీస్​ సెషన్స్​ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఆటగాళ్లకు బయోబబుల్​ నుంచి రక్షణ కోసం గ్రీన్ కారిడార్​ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బయోబబుల్​లో ఆటగాళ్ల కదలికలను, నిబంధనల్ని పరిశీలిస్తాం. నవీ ముంబయి నుంచి పుణెకు ఆటగాళ్లు ప్రయాణించేటప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ఎవరైనా కొవిడ్​ పాజిటివ్​గా తేలితే వారికి హోటల్​లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం."

-బీసీసీఐ అధికారిక వర్గాలు.

ఈ ఏడాది ఐపీఎల్​ మార్చి 26 నుంచి మే 29 వరకు జరగనుంది. మొత్తం 70 లీగ్​ మ్యాచులను ముంబయి, పుణెలోని స్టేడియాల్లో నిర్వహించనున్నారు. ప్లేఆఫ్​ మ్యాచుల వేదికలను తర్వాత ప్రకటించనున్నారు.

ముంబయిలోని వాంఖడే మైదానం 20 మ్యాచులకు ఆతిథ్యం ఇస్తుండగా.. బ్రబౌర్న్​ స్టేడియం 15 మ్యాచులకు, డీవై పాటిల్ స్టేడియంలో​ 20 మ్యాచులు జరగనున్నాయి. పుణెలోని ఎంసీఏ అంతర్జాతీయ స్టేడియంలో 15 మ్యాచులు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: ఐపీఎల్​లో కొత్త ఫార్మాట్.. చెన్నై, ముంబయి వేర్వేరు గ్రూప్స్​లో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.