ETV Bharat / sports

IPL 2022: సన్​రైజర్స్ 'తగ్గేదేలే'.. పుష్ప స్టైల్​లో ఇరగదీసిన ప్లేయర్లు​

IPL 2022: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్​​ ప్రారంభం కానున్న తరుణంలో సన్​రైజర్స్ జట్టు నెట్స్​లో ప్రాక్టీస్​ షూరూ చేసింది.​ ప్రాక్టీస్​ గ్యాప్​లో జట్టు ఆటగాళ్లు భువనేశ్వర్​, వాషింగ్టన్​ సుందర్​ తదితర ఆటగాళ్లు తగ్గేదేలే అంటూ చేసిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

సన్​రైజర్స్​ తగ్గేదేలే
sunrisers taggadele
author img

By

Published : Mar 21, 2022, 3:26 PM IST

IPL 2022: 2016లో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి.. 2018లో తుది సమరం వరకు వెళ్లిన సన్​రైజర్స్ జట్టు ఈ సీజన్​లో మెరుగైన ప్రదర్శనతో అదరగొట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఫ్రాంచైజీకి చెందిన ఆటగాళ్లంతా ప్రాక్టీస్​లో మునిగితేలుతున్నారు. అయితే, ప్రాక్టీస్ గ్యాప్​లో ఎస్​ఆర్​హెచ్​ ఆటగాళ్లంతా పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్​ను చెబుతూ అలరించారు. ఈ వీడియోను సోషల్​ మీడియాలో ఫ్రాంఛైజీ పోస్టు చేసింది. భువనేశ్వర్​ కుమార్​, వాషింగ్టన్​ సుందర్​ తదితర ఆటగాళ్లు తగ్గేదేలే అంటూ పుష్పరాజ్​ను అనుసరించారు. వీరిలో ఎవరు బాగా చేశారో చెప్పాలంటూ నెటిజన్లను కోరింది సన్​రైజర్స్.

Sunrisers Hyderabad: 2013లో లీగ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు అప్పటి నుంచి నిలకడగా రాణిస్తోంది. కానీ గతేడాది డేవిడ్​ వార్నర్​ను కెప్టెన్సీతో సహా జట్టు నుంచి కూడా తొలగించింది. ఈ ఏడాది మెగా వేలానికి ముందు కేన్​ విలియమ్సన్​, అబ్దుల్​ సమ్మద్​, ఉమ్రాన్​ మాలిక్​లను రిటైన్​ చేసుకుంది సన్​రైజర్స్​ జట్టు. భువనేశ్వర్​ కుమార్​, నటరాజన్​ను జట్టు​ తిరిగి సొంతం చేసుకోగా.. నికోలస్​ పూరన్​ను భారీ ధరకు దక్కించుకుంది. రషీద్​ ఖాన్​ వదులుకున్న హైదరాబాద్​ జట్టు వాషింగ్టన్ సుందర్​తో స్పిన్నర్​ స్థానాన్ని భర్తీ చేసుకుంది. ఇక సన్​రైజర్స్​ హైదరాబాద్​ తన తొలి మ్యాచ్​లో భాగంగా.. మార్చి 29న రాజస్థాన్​ రాయల్స్​తో తలపడనుంది.

ఇదీ చదవండి: ఐపీఎల్​లో 'సూ..పర్​' మచ్చి.. మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్​లివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.