ETV Bharat / sports

ఆ రోజు బ్యాట్​ నేలకేసి కొట్టా.. క్రికెట్​ వదిలేద్దామనుకున్నా: సంజూ

IPL 2022 Sanju Samson: తన కెరీర్​లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నట్లు తెలిపాడు రాజస్థాన్​ రాయల్స్​ సారథి సంజూ శాంసన్​. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శకంలో ఆడటం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని అన్నాడు.

IPL 2022 Sanju Samson
ఐపీఎల్ సంజూ శాంసన్​ బ్యాట్​
author img

By

Published : May 4, 2022, 8:49 AM IST

IPL 2022 Sanju Samson: ఈ ఐపీఎల్ సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్​ సారథిగా సత్తా చాటుతున్న సంజూ శాంసన్​.. తన కెరీర్​లో ఎదుర్కొన్న ఒడుదొడుకులను తెలిపాడు. ఆశించిన స్థాయిలో కెరీర్​ కొనసాగకపోవడం వల్ల క్రికెట్​కు దూరమవ్వాలని తాను గతంలో అనుకున్నట్లు చెప్పాడు. ​

క్లిష్టమైన దశ.. "నా 20 ఏళ్ల వయసులో భారత జట్టులోకి అరంగేట్రం చేశాను. ఆ తర్వాత మళ్లీ 25 ఏళ్ల వయసులో టీమ్​ఇండియాకు సెలెక్ట్‌ అయ్యాను. ఆ ఐదేళ్లు అత్యంత క్లిష్టమైన దశ. కేరళ జట్టు నుంచి కూడా నన్ను తప్పించారు. ఎన్నెన్నో సవాళ్లు. అలాంటి సమయంలో కచ్చితంగా మన మీద మనకు నమ్మకం పోతుంది. అయితే, నేను మాత్రం 'సంజూ నువ్వు మళ్లీ తిరిగి జట్టులోకి వస్తావ్'.. అని మనసుకు సర్దిచెప్పుకునేవాడిని. జీవితంలో ఇలాంటి కఠిన దశలు ఎదురవుతూ ఉంటాయి. నిజాయితీ, నమ్మకంతో వాటిని అధిగమించగలం." అని శాంసన్​ అన్నాడు.

బ్యాట్ నేలకు కొట్టి.. "ఆ ఐదేళ్ల కాలంలో నేను త్వరగా ఔటయ్యేవాడిని.. కోపం, విసుగు, చిరాకు వచ్చేవి. ఒకరోజు ఫ్రస్టేషన్​లో డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లగానే బ్యాట్‌ నేలకేసి కొట్టాను. మ్యాచ్‌ జరుగుతుండగానే మైదానం వీడి వెళ్లిపోయాను. అది బ్రబౌర్న్‌ స్టేడియం. ఇక క్రికెట్‌ వదిలేసి.. ఇంటికి వెళ్లిపోదామనుకున్నా. బ్యాట్‌ అక్కడే పడేసి కేరళకు తిరుగు ప్రయాణం అవుదామనుకున్నా. కాసేపటి తర్వాత మెరైన్‌ డ్రైవ్‌కు వెళ్లి సముద్రాన్ని చూస్తూ నాలో నేనే ఆలోచించడం మొదలుపెట్టాను. రెండు గంటల పాటు అక్కడ కూర్చుని మ్యాచ్​ అయిపోయాక రాత్రి తిరిగి వచ్చాను. విరిగిపడిన నా బ్యాట్‌ చూసి పశ్చాతాపానికి గురయ్యాను. బ్యాట్‌ను కాకుండా పిల్లోను విసిరిపడేయాల్సింది అని అనుకున్నాను" అని సంజూ శాంసన్ గుర్తు చేసుకున్నాడు.

రాహుల్​ ద్రవిడ్​ ప్రభావం.. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శకంలో ఆడటం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని శాంసన్‌ వెల్లడించాడు. దిల్లీ, రాజస్థాన్‌ జట్లకు రాహుల్ ద్రవిడ్‌ మెంటార్‌గా వ్యవహరించిన సమయంలో మూడు నాలుగేళ్లపాటు ఆడటం జీవితంలో మరిచిపోలేనని సంజూ పేర్కొన్నాడు. " రాహుల్‌ ద్రవిడ్‌ యువ క్రికెటర్లను ఎంతో ప్రోత్సహించేవాడు. దిల్లీ తరఫున నేను ఆడేటప్పుడు అప్పటికే కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, రిషభ్‌ పంత్ ఉన్నారు. మేమందరం అదే అనుభవం పొందాం. ఎంతో నేర్చుకున్నాం. నాకైతే పూర్తిగా గుర్తు లేదు కానీ.. మాలో నలుగురినో ఐదుగురినో పిలిచి చెప్పాడు. మీరంతా టీమ్‌ఇండియాకు ఆడతారు. ఇది ప్రతి యువ క్రికెటర్‌కు ఎంతో ఉత్సాహానిస్తోంది. ఇక నాలుగేళ్లపాటు ద్రవిడ్‌తో సమయం గడపడం చాలా బాగుంది. ప్రతి విషయాన్ని అడిగేవాడిని. దానిని వెంటనే నోట్‌బుక్‌లో ఎక్కించేవాడిని. ప్రతి రోజూ ఇంతే. రాహుల్‌తో మాట్లాడిన వెంటనే రూమ్‌లోకి వెళ్లి ఏం చెప్పాడో రాసి పెట్టుకునేవాడిని" అని వివరించాడు. రాజస్థాన్‌ (2013- 2015, 2018 నుంచి కొనసాగుతూ), దిల్లీ (2016-2017) తరఫున సంజూ శాంసన్‌ ఆడాడు. ప్రస్తుతం టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ (12) ఆరు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి: IPL 2022: అంపైరాంగ్‌.. దుమారం రేపుతున్న తప్పుడు నిర్ణయాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.