IPL 2022 Rohit Sharma: ముంబయి ఇండియన్స్ జట్టుకు 8 ఏళ్లకుపైగా కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 116 ఐపీఎల్ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన అతడు.. ఐదు సార్లు జట్టుకు కప్పును అందించాడు. అయితే ఈ సారి మెగా వేలంలో ముంబయి జట్టుకు చాలా మంది కొత్త ఆటగాళ్లు వచ్చారు.
10000 Runs Rohit Sharma: రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్లో రాణిస్తే.. టీ20ల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటనున్నాడు. ఇప్పటివరకు టీ20 కెరీర్లో 9895 పరుగులు చేసిన రోహిత్ .. మరో 105 పరుగులు సాధిస్తే పదివేల మార్క్‌ను చేరుకోనున్నాడు. భారతీయ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ తర్వాత పదివేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డుకెక్కనున్నాడు. ఇప్పటివరకు హిట్‌మ్యాన్ 370 టీ20లు ఆడి 9895 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 69 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన వారి జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ 14562 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ నుంచి వైదొలిగిన గేల్.. ఇతర టీ20 టోర్నీల్లో ఆడుతున్నాడు. గేల్ తర్వాత షోయబ్ మాలిక్(11698), పొలార్డ్(11427), ఫించ్(10444), డేవిడ్ వార్నర్(10308) వరుసగా ఉన్నారు.
ఇదీ చదవండి: IPL 2022: విధ్వంస వీరులు.. తక్కువ బంతుల్లో అర్ధశతకాలు!