ETV Bharat / sports

IPL 2022 opening combinations: ఏ జట్లకు ఎవరెవరున్నారంటే?

IPL 2022 opening combinations: ఐపీఎల్​ మెగావేలం ప్రక్రియ పూర్తైంది. ఇక తుది జట్లలోకి ఎవరిని తీసుకోవాలనే విషయమై కసరత్తులు చేయాలి. ఈ నేపథ్యంలో ఆయా జట్లలో ఓపెనర్లుగా ఎవరున్నారు? బలమైన ఓపెనింగ్​ జోడీ ఏది? లేని టీమ్​లకు ఎలాంటి కాంబినేషన్​ను ప్రయత్నిస్తే బాగుంటుందో చూద్దాం...

author img

By

Published : Feb 16, 2022, 7:42 AM IST

Updated : Feb 16, 2022, 8:22 AM IST

IPL 2022 opening combinations
ఐపీఎల్​ 2022 ఓపెనింగ్​ జోడీలు

IPL 2022 opening combinations: ఐపీఎల్​లో పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటెయిన్‌/కొనుగోలు చేసే ప్రక్రియ ముగిసింది. ఇక వచ్చే సీజన్‌ పోటీల కోసం తుది జట్లపై కసరత్తును ప్రారంభించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా బ్యాటింగ్‌లో మంచి శుభారంభం దక్కాలంటే బలమైన ఓపెనింగ్‌ జోడీ ఉండాలి. కొన్ని జట్లకు అద్భుతమైన ఓపెనర్లు ఉండగా.. మరికొన్ని టీమ్‌లు కొత్త జోడీలను సెట్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏ జట్టుకు ఎవరు ఉన్నారు.. లేని జట్లు ఎలాంటి ఓపెనింగ్​ జోడీని ప్రయత్నిస్తే బాగుంటుందో ఓసారి చూద్దాం.

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: గత సీజన్‌ వరకు అద్భుతమైన బౌలింగ్‌తో ఎలాంటి జట్టుకైనా ముచ్చెమటలు పట్టించే జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌ లోపంతో చిన్న లక్ష్యాలను కూడా ఛేదించేందుకూ ఇబ్బంది పడింది. మొన్నటి వరకు బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్‌, వృద్ధిమాన్‌ సాహా, జాసన్‌ రాయ్ వంటి ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురూ ఎస్ఆర్‌హెచ్‌ క్యాంపస్‌లో లేరు. రాహుల్‌ త్రిపాఠి, నికోలస్‌ పూరన్‌, మార్‌క్రమ్‌, గ్లెన్‌ఫిలిప్స్‌ వంటి వారితో ఓపెనింగ్‌ ప్రయత్నించొచ్చు. వన్‌డౌన్‌లో ఎలాగూ కేన్‌ విలియమ్సన్‌ ఉండనే ఉన్నాడు.
  • చెన్నై సూపర్‌ కింగ్స్ : గత సీజన్‌లో రుతురాజ్‌-డుప్లెసిస్‌ జోడీ టాప్‌ స్కోరర్లుగా రాణించడం వల్ల సీఎస్కే కప్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈసారి డుప్లెసిస్‌ స్థానంలో రుతురాజ్‌కు తోడుగా రాబిన్‌ ఉతప్ప, డేవన్‌ కాన్వే, మొయిన్‌ అలీని ఓపెనింగ్‌కు పంపే వెసులుబాటు ఉంది. అవసరమైతే అంబటి రాయుడు కూడా ఇన్నింగ్స్‌ను ఆరంభించగలడు. అయితే ఓపెనర్లు ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన సీఎస్‌కే కెప్టెన్‌ ధోనీ మాత్రం ఎలాంటి మార్పులు చేయడు. కాబట్టి మిస్టర్ కూల్‌ కొత్త ప్రయోగాలు చేయడానికీ వెనుకాడడు.
  • దిల్లీ క్యాపిటల్స్‌ : ఒక వైపు పృథ్వీ షా ఫిక్స్‌. ఇప్పుడు డేవిడ్ వార్నర్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ తీసుకోవడం వల్ల ఓపెనింగ్ సమస్య అయితే లేదు. వీరిద్దరికి బ్యాకప్‌గా కేఎస్‌ భరత్‌, సర్ఫ్‌రాజ్‌ ఖాన్, అశ్విన్‌ హెబ్బర్‌ను ఉంచుకోవచ్చు. రిషభ్‌ పంత్‌ విండీస్‌తో ఓ మ్యాచ్‌లో ఓపెనింగ్‌కు దిగాడు. అయితే అది సఫలీకృతం కాలేదనే చెప్పాలి. మిడిలార్డర్‌లో రిషభ్‌ సేవలు ఎంతో అవసరం. తుది జట్టులో వార్నర్‌, పృథ్వీ షా ఉంటే వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు.
  • గుజరాత్ టైటాన్స్‌ : హార్దిక్‌ పాండ్య, రషీద్‌ ఖాన్, శుభ్‌మన్‌ గిల్‌ను రిటెయిన్ చేసుకున్న గుజరాత్‌ టైటాన్స్​కు ఓపెనర్లు ఎవరనే సందిగ్దత లేదు. గిల్‌తోపాటు జాసన్ రాయ్‌, డేవిడ్ మిల్లర్‌, వృద్ధిమాన్‌ సాహా ఓపెనర్లుగా దిగే అవకాశం ఉంది. రాయ్‌, సాహా ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనుభవం ఉంది. మిడిలార్డర్‌లో మాథ్యూ వేడ్, రాహుల్‌ తెవాతియా, విజయ్‌ శంకర్‌, హార్దిక్ వంటి ఆటగాళ్లు ఎలానూ ఉన్నారు.
  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ : ఎప్పుడు ఎలాంటి ప్రయోగాలు చేస్తుందో తెలియని జట్టు కేకేఆర్‌. గత సీజన్లలో కొన్నిసార్లు వెంకటేశ్‌ అయ్యర్‌, సునిల్‌ నరైన్‌, నితీశ్ రాణా, గిల్, త్రిపాఠితో ఓపెనింగ్‌ చేయించింది. ఇప్పుడు నరైన్‌, రాణా, వెంకటేశ్ అయ్యర్‌ జట్టులో ఉన్నారు. వచ్చే సీజన్‌లో వీరిలో ఓపెనింగ్‌కు పంపే అవకాశాలు లేకపోలేదు. అలానే శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నా.. అతడిని వన్‌డౌన్‌లో దింపేందుకే కేకేఆర్‌ మొగ్గు చూపొచ్చు. వీరు అందుబాటులో లేకపోతే సామ్‌ బిల్లింగ్స్‌, రింకు సింగ్‌, అభిజిత్‌ తోమర్‌నూ ప్రయత్నించే అవకాశం ఉంది.
  • లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ : ప్రస్తుతం ఉన్న ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో ఓపెనింగ్‌ కొరత లేని జట్లలో లఖ్‌నవూ ఒకటి. ఆ జట్టు సారథి కేఎల్‌ రాహుల్‌ ఎలానూ ఓపెనర్‌గా వస్తాడు. ఇక రెండో వైపు క్వింటన్‌ డికాక్‌, మనన్‌ వోహ్రా, ఎవిన్‌ లూయిస్‌ వంటి ఆప్షన్లు ఎల్‌ఎస్‌జీకి ఉన్నాయి. అవసరమైతే మనీశ్‌ పాండే మిడిలార్డర్‌తోపాటు ఓపెనింగ్‌ చేయగలడు. జాసన్ హోల్డర్‌, దీపక్‌ హుడా, కృనాల్ పాండ్య, కృష్ణప్ప గౌతమ్‌, స్టొయినిస్‌ ఆటగాళ్లు ఎలానూ ఉన్నారు.
  • ముంబయి ఇండియన్స్‌ : ఐదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కు ఓపెనింగ్ సమస్యే లేదు. భారీ ధర వెచ్చించి మరీ తమ వద్దే ఉంచుకున్న ఇషాన్‌ కిషన్‌ తోడుగా కెప్టెన్ రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ చేసేస్తాడు. తప్పదనుకుంటే సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త కుర్రాళ్లలో అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, ‘జూనియర్ ఏబీడీ’ డేవడ్‌ బ్రెవిస్‌ను బ్యాకప్‌గా ఉన్నారు. పాత కూర్పుతోనే ఓపెనింగ్‌ చేస్తారా.. కొత్త ఆటగాళ్లను తయారు చేసుకుని బరిలోకి దింపుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
  • పంజాబ్‌ కింగ్స్‌ : పేరులోనే కింగ్స్‌ ఉన్నట్లు.. పంజాబ్‌కు ఓపెనింగ్‌ బెడద లేదు. మయాంక్‌ అగర్వాల్‌, శిఖర్ ధావన్‌, బెయిర్‌స్టో, లివింగ్‌ స్టోన్‌ వంటి హేమాహేమీలు ఆ జట్టు సొంతం. మిడిలార్డర్‌లో షారుఖ్‌ ఖాన్‌, ఓడియన్‌ స్మిత్, భనుక రాజపక్స, నాథన్‌ ఎల్లిస్‌ తదితరులు రాణించగలిగే సత్తా ఉన్నవాళ్లే. అయితే కెప్టెన్‌గా ఎవరిని నియమిస్తారనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. యువ క్రికెటర్‌గా మయాంక్‌ అగర్వాల్‌కు దక్కే అవకాశం ఉంది. శిఖర్‌ ధావన్‌కు నాయకుడిగా అనుభవం ఉన్నప్పటికీ వయస్సురీత్యా ఇవ్వకపోవచ్చు.
  • రాజస్థాన్‌ రాయల్స్‌ : అబ్బో ఈ జట్టులో ఓపెనర్లు భారీగా ఉన్నారు. మెగా వేలంలో పక్కా ప్రణాళికతో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కెప్టెన్‌ సంజూ శాంసన్, జోస్‌ బట్లర్‌, యశస్వి జైస్వాల్, దేవదుత్‌ పడిక్కల్‌ వంటి మంచి ఆరంభాన్నిచ్చే బ్యాటర్లను కలిగిన ఏకైక జట్టు రాజస్థాన్‌. బట్లర్‌-జైస్వాల్‌, జైస్వాల్‌-పడిక్కల్‌, జైస్వాల్‌-సంజూ.. ఇలా కాంబినేషన్లతో ఓపెనింగ్‌కు దిగే వెసులుబాటు రాజస్థాన్‌కు ఉంది. ఇక మిడిలార్డర్‌లో డస్సెన్, హెట్‌మయర్‌, రియాన్‌ పరాగ్‌, జేమ్స్‌ నీషమ్‌, కరుణ్ నాయర్‌, డారిల్ మిచెల్‌ బ్యాటర్లు రాణించగలరు.
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : అగ్రశ్రేణి ఆటగాళ్లకు కొదవలేదు. విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌కు ఇప్పుడు డుప్లెసిస్‌, దినేశ్ కార్తిక్‌, డేవిడ్‌ విల్లే, వనిందు హసరంగ, ఫిన్‌ అలెన్‌ తోడయ్యారు. గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున ఓపెనర్‌గా డుప్లెసిస్‌ అత్యధిక పరుగుల జాబితాలో రెండో ఆటగాడు. విరాట్ కోహ్లీ ఎలాగూ ఓపెనింగ్ చేయగలడు. అలాకాదు విరాట్‌ను వన్‌డౌన్‌లో పంపించాలనుకుంటే మాత్రం డుప్లెసిస్‌కు తోడుగా దినేశ్ కార్తిక్‌, ఫిన్‌ అలెన్‌.. ఎవరో ఒకరిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: నా పాన్​కార్డ్​ పోయింది ఎవరైనా సాయం చేయండి: కెవిన్​ పీటర్సన్​

Last Updated : Feb 16, 2022, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.