IPL 2022 MS DHONI: కెప్టెన్‌గా బాధ్యతలు వదిలేసిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ధోనీ సత్తాచాటాడు. ఈ పోరులో తనలోని బ్యాటర్‌ను తిరిగి బయటకు తీసి అజేయంగా 50 పరుగులు చేశాడు. దీంతో పెద్ద వయసులో ఐపీఎల్ అర్ధసెంచరీ సాధించిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 40 ఏళ్ల 262 రోజుల వయసులో అర్ధశతకం అందుకున్న ధోనీ.. రాహుల్ ద్రవిడ్ (40 ఏళ్ల 116 రోజులు)ను వెనక్కినెట్టాడు.
దాదాపుగా మూడేళ్లలో ధోనీకిదే తొలి అర్ధసెంచరీ. చివరగా అతను 2019, ఏప్రిల్ 21న అజేయంగా 84 పరుగులు చేశాడు. మొత్తంగా ఇది అతనికి 24వ అర్ధశతకం. ధోనీ ప్రదర్శనపై అభిమానులు సామాజిక మాధ్యమాల్లో "తలా తిరిగొచ్చాడు" అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆల్‌టైమ్ దిగ్గజం ధోనీ అని కామెంట్లు చేస్తున్నారు.
బ్రావో రికార్డు: మరో చెన్నై జట్టు ఆటగాడు డ్వెేన్ బ్రావో కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో అత్యధిక వికెట్లు పడగొట్టిన లసిత్ మలింగ(170 వికెట్లు)ను సమం చేశాడు.
శనివారం జరిగిన ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే ఛేదించింది కోల్‌కతా.
ఒలింపిక్ వీరులకు సత్కారం: అంతకుముందు ఐపీఎల్ ప్రారంభ వేడుకలో టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లను బీసీసీఐ సత్కరించింది. జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు రూ.కోటి చెక్కును అందజేశాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. కాంస్యం నెగ్గిన బాక్సర్ లవ్లీనాకు రూ.25 లక్షలు, చారిత్రక కంచు పతకం సొంతం చేసుకున్న పురుషుల హాకీ జట్టుకు రూ.కోటి ఇచ్చారు. హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఈ చెక్కు స్వీకరించాడు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: IPL 2022: తొలి మ్యాచ్‌లో చెన్నైపై కోల్‌కతా ఘన విజయం