ETV Bharat / sports

IPL 2022: టాస్​ నెగ్గిన దిల్లీ.. ముంబయి బ్యాటింగ్​ - ముంబయి ఇండియన్స్​

IPL 2022 MI Vs DC: ఐపీఎల్​ 2022లో భాగంగా నేడు(ఆదివారం) ముంబయి ఇండియన్స్​.. దిల్లీ క్యాపిటల్స్​తో తలపడనుంది. మొదటగా ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన దిల్లీ ఫీల్డింగ్​ ఎంచుకుంది.

ipl 2022
mi vs dc
author img

By

Published : Mar 27, 2022, 3:05 PM IST

Updated : Mar 27, 2022, 3:17 PM IST

IPL 2022 MI Vs DC: ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్​ ఛాంపియన్​గా నిలిచి.. మరో టైటిల్​ వేటలో ఉన్న ముంబయి ఇండియన్స్​ నేడు(ఆదివారం) తన తొలి మ్యాచ్ ఆడనుంది.బ్రాబోర్న్​ స్టేడియం వేదికగా దిల్లీ క్యాపిటల్స్​తో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టాస్​ గెలిచిన దిల్లీ ఫీల్డింగ్​ ఎంచుకుంది. దీంతో ముంబయి జట్టు బ్యాటింగ్​కు దిగనుంది. కాగా, గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయిన ముంబయి, ఈ సారి ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని చూస్తోంది. మరోవైపు దిల్లీ తొలి మ్యాచ్‌లో నెగ్గి మంచి ఆరంభం సాధించాలని ఆశిస్తోంది. ఐపీఎల్‌లో ముంబయి, దిల్లీ జట్లు ఇప్పటి వరకు 30 సార్లు తలపడ్డాయి. 16 మ్యాచుల్లో ముంబయి గెలిచింది. 14 మ్యాచుల్లో దిల్లీ విజయం సాధించింది.

తుది జట్ల వివరాలివీ..

దిల్లీ జట్టు: రిషభ్​ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, మన్‌దీప్‌ సింగ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, కమ్లేష్ నాగర్‌కోటి, టిమ్‌ సీఫెర్ట్, కులదీప్​ యాదవ్​.

ముంబయి జట్టు: రోహిత్​ శర్మ(కెప్టెన్​), ఇషాన్​ కిషన్​, తిలక్​ వర్మ, అన్‌మోల్‌ సింగ్, కీరన్‌ పొలార్డ్‌, టిమ్‌ డేవిడ్, డానియల్ సామ్స్, మురుగన్‌ అశ్విన్‌, మిల్స్​, జస్ప్రీత్​ బుమ్రా, బాసిల్​ థంపి.

ఇదీ చదవండి: Ind vs SA: టీమ్​ఇండియాకు నిరాశ.. ప్రపంచకప్​ ఆశలు గల్లంతు

Last Updated : Mar 27, 2022, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.