ETV Bharat / sports

ఐపీఎల్ మెగా వేలం తేదీ ఖరారు.. కొత్త ఫ్రాంఛైజీలకు లైన్​ క్లియర్ - ఐపీఎల్ వేలం తేదీ ఖరారు

IPL 2022: ఐపీఎల్​ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశారు. కాగా, కొత్త ఫ్రాంఛైజీలు లఖ్​నవూ, అహ్మదాబాద్​కు బీసీసీఐ ఫార్మల్ క్లియరన్స్​ ఇచ్చినట్లు తెలిపారు.

ipl
ఐపీఎల్
author img

By

Published : Jan 11, 2022, 7:01 PM IST

Updated : Jan 11, 2022, 7:22 PM IST

IPL 2022: ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ​ త్వరలోనే ప్రారంభంకానున్న నేపథ్యంలో రెండు కొత్త జట్లకు అధికారిక అనుమతులు ఇచ్చింది భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). మంగళవారం ఐపీఎల్​ పాలక మండలి సమావేశం అనంతరం లఖ్​నవూ, అహ్మదాబాద్​ ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఫార్మల్ క్లియరన్స్ ఇచ్చినట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ తెలిపారు. మెగా వేలానికి ముందే రెండు జట్లు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించాలని జట్లకు తెలిపినట్లు పేర్కొన్నారు.

కాగా, ఐపీఎల్​ మెగావేలం తేదీ కూడా ఖరారైనట్లు బ్రిజేశ్ స్పష్టం చేశారు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

టైటిల్​ స్పాన్సర్​గా టాటా గ్రూప్స్..

IPL Title Sponsor: దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన టాటా గ్రూప్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ కొత్త స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఇప్పటివరకు టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న చైనా మొబైల్‌ తయారీ సంస్థ 'వీవో' వైదొలగనుంది. ఈ మేరకు ఐపీఎల్‌ కమిటీ నిర్ణయించినట్లు ఐపీఎల్‌ ఛైర్మన్ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు.

ఇదీ చూడండి:

ఐపీఎల్​కు కొత్త టైటిల్ స్పాన్సర్.. వివో స్థానంలో టాటా

టీమ్​ఇండియాకు షాక్​.. వన్డే జట్టు ఆల్​రౌండర్​కు కొవిడ్

Last Updated : Jan 11, 2022, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.