ETV Bharat / sports

IPL 2022: ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. ఐపీఎల్-15 అప్పటినుంచే..!

క్రికెట్​ అభిమానులకు గుడ్​న్యూస్. ఐపీఎల్​ 15వ సీజన్​ (IPL 2022 start date) త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

IPL
ఐపీఎల్
author img

By

Published : Nov 24, 2021, 8:07 AM IST

క్రికెట్ అభిమానుల్లో మరింత జోష్​ను నింపేందుకు సిద్ధమవుతోంది బీసీసీఐ. వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్​ను(IPL 2022 start date) 2022 ఏప్రిల్​ 2 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఫ్రాంఛైజీలకు సమాచారం అందించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. చెన్నై వేదికగానే తొలి మ్యాచ్​ నిర్వహించనున్నట్లు సమాచారం.

15వ ఐపీఎల్ సీజన్​లో (IPL 2022 news) 10 జట్లు పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు మొత్తంగా 74 మ్యాచ్​లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. అయితే.. 60 రోజుల పాటు ఈ మ్యాచ్​లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్​ మ్యాచ్ జూన్​ తొలి వారంలో జరిపించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

తొలి మ్యాచ్ చెపాక్​ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్​​ చెన్నైకి మరో జట్టుకు మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ మ్యాచ్​ కోల్​కతాతో జరగనుందా? లేదా ముంబయితో ఉండనుందా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

భారత్​లోనే..

"అన్నీ అనుకూలంగా ఉంటే వచ్చే ఏడాది ఐపీఎల్​ను (15వ సీజన్‌) భారత్‌లోనే నిర్వహిస్తాం. మరో రెండు జట్లు వస్తున్న నేపథ్యంలో మరింత జోష్ వస్తుందని భావిస్తున్నా. చెపాక్‌ స్టేడియంలో సీఎస్‌కే ఆడటం మీరు చూసే అవకాశం ఉంది. త్వరలోనే మెగా వేలం (ipl 2022 mega auction date) నిర్వహించబోతున్నాం. కొత్త కాంబినేషన్స్‌పై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది."

-జై షా, బీసీసీఐ కార్యదర్శి

ఐపీఎల్-2021 సీజన్​ను (ipl 2021 news) భారత్​లోనే నిర్వహించాలని తలపెట్టారు. కానీ కొద్ది రోజులకే బయో బబుల్​లో కరోనా తీవ్రత వల్ల కొన్ని మ్యాచ్​ల తర్వాత లీగ్​ను అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఈ సీజన్ రెండో దశను యూఏఈ వేదికగా నిర్వహించగా చెన్నై సూపర్ కింగ్స్(ipl 2021 winner) విజేతగా నిలిచింది.

ఇవీ చూడండి: వచ్చే ఐపీఎల్​లో ఆడటంపై ధోనీ ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.