ETV Bharat / sports

సురేష్ రైనాను అందుకే తీసుకోలేదు: సీఎస్కే

IPL 2022: సురేష్ రైనాను తీసుకోకపోవడంపై సీఎస్కే యాజమాన్యం స్పందించింది. ఫామ్​ ఆధారంగానే ఆటగాన్ని తీసుకుంటామని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ తెలిపారు. టీంకు రైనా ఫిట్​ కాదని భావించినట్లు పేర్కొన్నారు.

suresh raina in csk
ఐపీఎల్ 2022
author img

By

Published : Feb 14, 2022, 8:33 PM IST

Updated : Feb 14, 2022, 8:40 PM IST

IPL 2022: ఐపీఎల్ 2022 మెగా వేలంలో సురేష్ రైనాను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకోలేదు. కనీస విలువ రూ.2కోట్లతో వేలంలోకి వచ్చిన రైనాను అన్నీ టీంలు పక్కకు పెట్టేశాయి. దీనిపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పందిస్తూ..'గత పన్నెండేళ్లుగా రైనా అద్భుతంగా రాణించాడు. కానీ అతన్ని తీసుకోవడం మాకు చాలా కష్టమైన విషయం. ఫామ్​ ఆధారంగానే ఆటగాన్ని తీసుకుంటామని అర్థం చేసుకోవాలి. మా టీంకు అతను ఫిట్ కాదని మేము భావించాం. రైనాను మిస్​ అవుతున్నాం. ' అని చెప్పారు.

మరోవైపు రైనా సేవలకుగాను చెన్నై సూపర్​కింగ్స్ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్​లో తెలిపింది.

2008 నుంచి సురేష్ రైనా.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. 2018లో టైటిల్ విన్నింగ్​లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్​లో 445 రన్స్ సాధించాడు. 15 ఆటల్లో 37.08 సరాసరితో నాలుగు అర్థ సెంచరీలు చేసిన రికార్డ్ ఉంది.

ఇదీ చదవండి: IPL 2022: సీఎస్కే.. ఈ సారి వేలంలో రూటు మార్చిందిగా!

Last Updated : Feb 14, 2022, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.