ETV Bharat / sports

ఐపీఎల్​ మ్యాచ్​.. ముద్దుల్లో మునిగిపోయిన జంట.. నెట్టింట వైరల్​! - ఐపీఎల్​ లైవ్​ అప్​డేట్స్​

Couple Lip Kissing IPL: స్టేడియంలో ఓ వైపు మ్యాచ్​లు జరుగుతుంటే.. మరోవైపు అక్కడే స్టాండ్స్​లో ఉన్న ప్రేమికులు ప్రపోజ్​ చేసుకోవడం వంటివి ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగానే చూస్తున్నాం. అయితే.. గతంలో ఎక్కువగా ఫుట్​బాల్​ లీగ్​లకే పరిమితమైన ఈ సంప్రదాయం ఇప్పుడు క్రికెట్​కూ పాకింది. ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​, గుజరాత్​ టైటాన్స్​ మధ్య శనివారం మ్యాచ్​ జరుగుతుండగా ఓ జంట చేసిన పని.. సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ipl 2022 couple lip kissing during ipl match viral

author img

By

Published : Apr 3, 2022, 1:01 PM IST

Couple Lip Kissing IPL: గుజరాత్​ టైటాన్స్​, దిల్లీ క్యాపిటల్స్​ మధ్య శనివారం పుణె వేదికగా మ్యాచ్​ జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో.. గుజరాత్​ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. మ్యాచ్​ జరుగుతున్న సమయంలో స్టాండ్స్​లో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఓ జంట లిప్​ కిస్​ పెట్టుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్టేడియంలో అంత మంది ఉన్నా.. చుట్టుపక్కల వారిని ఎవరినీ పట్టించుకోకుండా ఆ జంట కాసేపు ముద్దులాటలో మునిగిపోయింది. ఈ ఫొటోను ఎవరో ఫొటో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయగా.. నెట్టింట వైరల్​గా మారింది. దీనిపై నెటిజన్లు మీమ్స్​, ట్రోల్స్​ చేస్తున్నారు. ఐపీఎల్​ను ఈ జోడీ మరో లెవల్​కు తీసుకెళ్లిందని ఒకరంటే.. మరికొందరు ఆ కెమెరామెన్​ పనితనాన్ని మెచ్చుకుంటున్నారు.

ipl 2022 couple lip kissing during ipl match viral
మ్యాచ్​ జరుగుతుండగా లిప్​లాక్​

గుజరాత్​ గెలుపు: తొలుత బ్యాటింగ్​ చేసిన గుజరాత్​ టైటాన్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. శుభ్​మన్​ గిల్​(46 బంతుల్లో 84) అద్భుతమైన ఇన్నింగ్స్​ ఆడాడు. హార్దిక్​ పాండ్య(31), మిల్లర్​(20*) పరుగులతో రాణించారు. దిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్​ 3, ఖలీల్​ అహ్మద్​ 2 వికెట్లు తీశారు. అనంతరం.. బ్యాటింగ్​కు దిగిన దిల్లీకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు టిమ్​ సీఫర్ట్​(3), పృథ్వీషా(10) పరుగులకే వెనుదిరిగారు. పంత్​(43), లలిత్​ యాదవ్​(25), పావెల్​(20) ఆడినా.. జట్టును గెలిపించలేకపోయారు. గుజరాత్​ బౌలర్లలో ఫెర్గూసన్​ 4, షమీ 2 వికెట్లు తీశారు.

ఇవీ చూడండి: ఫైనల్లో 'హేలీ' ప్రపంచ రికార్డ్​.. ఇంగ్లాండ్​ ముందు భారీ లక్ష్యం

'హార్దిక్​ పాండ్య అలా అవడానికి కృనాలే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.