Hardik pandya IPL: ఐపీఎల్లో ఈ సీజన్‌తో ఎంట్రీ ఇవ్వనున్న అహ్మదాబాద్ జట్టుకు 'గుజరాత్ టైటాన్స్' అని పేరు పెట్టారు. ఈ టీమ్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వహించనున్నాడు.
ఈ ఏడాది లీగ్‌లో అడుగుపెట్టిన కొత్త జట్లలో సీవీసీ గ్రూప్.. అహ్మదాబాద్ జట్టును రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది. సంజీవ్ గోయంకా ఆర్పీఎస్జీ.. లక్నో ఫ్రాంచైజీని రూ.7090 కోట్లకు సొంతం చేసుకుంది. వీటిలో లక్నో టీమ్‌కు 'లక్నో సూపర్‌జెయింట్స్' అని పేరు పెట్టగా, అహ్మదాబాద్ జట్టుకు 'గుజరాత్ టైటాన్స్' అని పేరు పెట్టారు.
-
🔊 Here's more about our name, before you 'Remember The Name'! 😊 #GujaratTitans pic.twitter.com/UA1KcjT1Hr
— Gujarat Titans (@gujarat_titans) February 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">🔊 Here's more about our name, before you 'Remember The Name'! 😊 #GujaratTitans pic.twitter.com/UA1KcjT1Hr
— Gujarat Titans (@gujarat_titans) February 9, 2022🔊 Here's more about our name, before you 'Remember The Name'! 😊 #GujaratTitans pic.twitter.com/UA1KcjT1Hr
— Gujarat Titans (@gujarat_titans) February 9, 2022
గుజరాత్ టైటాన్స్.. ప్రీ ఆక్షన్‌లో హార్దిక్ పాండ్య-రూ.15 కోట్లు, రషీద్ ఖాన్- రూ.15 కోట్లు, శుభ్‌మన్ గిల్- రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే మెగావేలంలో మిగిలిన ప్లేయర్లను ఎంపిక చేసుకోనుంది.
భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా.. గుజరాత్ టైటాన్స్ జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్.. మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
ఇవీ చదవండి: