ETV Bharat / sports

IPL 2021: మధ్యలో వచ్చారు.. మురిపిస్తారా? - tim david ipl

ఐపీఎల్ రెండో దశ(IPL 2021 second phase) మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే ఈ లీగ్​కు కొంతమంది ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు. దీంతో వారి స్థానంలో ఆడేందుకు మిగతా ప్లేయర్స్​కు అవకాశం దొరికింది. మరి వారెవరు? వారి రికార్డులేంటి చూద్దాం..

ipl
ఐపీఎల్​
author img

By

Published : Sep 15, 2021, 12:47 PM IST

ఐపీఎల్‌లో(IPL 2021 second phase) ఆడటం ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్‌ దేశాల ఆటగాళ్ల కల. ఇక్కడ దక్కే ఆదరణ, ఆదాయం వేరుగా ఉంటాయి. తమ దేశవాళీ టోర్నీల్లో, ఇతర లీగ్‌ల్లో సత్తా చాటి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిలో పడటానికి గట్టిగానే ప్రయత్నిస్తుంటారు విదేశీ క్రికెటర్లు. అయితే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో తమకిక అవకాశం లేదనుకున్న కొందరు క్రికెటర్లకు.. కరోనా కారణంగా మధ్యలో లీగ్‌కు బ్రేక్‌ పడటం వల్ల రెండో దశలో అనుకోకుండా ఛాన్స్‌ వచ్చింది. ఆ క్రికెటర్లెవరో.. వాళ్లు ప్రాతినిధ్యం వహించే జట్లేవో వాళ్ల నేపథ్యాలేంటో, నైపుణ్యాలేంటో.. చూద్దాం పదండి.

అదిల్‌ రషీద్‌(adil rashid ipl team)

33 ఏళ్ల ఈ ఇంగ్లాండ్‌ సీనియర్‌ స్పిన్నర్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌(kings eleven punjab).. ఆస్ట్రేలియా పేసర్‌ జే రిచర్డ్‌సన్‌ స్థానంలో తీసుకుంది. భారీ ధరకు పంజాబ్‌ సొంతమైన రిచర్డ్‌సన్‌ ఐపీఎల్‌-14 తొలి దశలో తేలిపోయాడు. గాయం కారణంగా అతను మిగతా సీజన్‌కు దూరం కాగా.. ఈ పేసర్‌ స్థానంలో స్పిన్నర్‌ అయిన రషీద్‌ను ఎంచుకుని ఆశ్చర్యపరిచింది పంజాబ్‌. 194 టీ20ల్లో 232 వికెట్లు పడగొట్టిన అనుభవమున్న రషీద్‌.. ఐపీఎల్‌ అరంగేట్రంలో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.

గ్లెన్‌ ఫిలిప్స్‌

రాజస్థాన్‌ రాయల్స్‌కు గత సీజన్లో పెద్ద బలంగా నిలిచిన జోఫ్రా ఆర్చర్‌(jofra archer ipl 2021).. ఈ సీజన్‌ మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి స్థానంలోకి సీజన్‌ తొలి దశలో ఏ ఆటగాడినీ తీసుకోని రాయల్స్‌.. రెండో దశలో న్యూజిలాండ్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ను తీసుకుంది. బట్లర్‌ కూడా దూరం కావడంతో గ్లెన్‌కు అవకాశం దక్కింది. వికెట్‌ కీపింగ్‌ చేయడంతో పాటు స్పిన్‌ బౌలింగ్‌ కూడా వేయగల ఫిలిప్స్‌.. వేర్వేరు టీ20 లీగ్స్‌లో సత్తా చాటాడు. 128 టీ20లాడి 33.04 సగటుతో 3998 పరుగులు చేసిన రికార్డున్న ఫిలిప్స్‌ ఐపీఎల్‌లోనూ మెరుపులు మెరిపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

జార్జ్‌ గార్టన్‌(george garton ipl 201)

ఈ ఇంగ్లాండ్‌ దేశవాళీ పేసర్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఎంచుకుంది. అతను ఆస్ట్రేలియా పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ స్థానంలోకి వచ్చాడు. కేన్‌ లాగే లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్‌ అయిన గార్టన్‌.. ఇంగ్లాండ్‌ దేశవాళీ టోర్నీ టీ20 బ్లాస్ట్, కొత్తగా ప్రవేశపెట్టిన ‘హండ్రెడ్‌’ టోర్నీల్లో సత్తా చాటి ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకున్నాడు. లోయరార్డర్లో బ్యాటుతోనూ మెరుపులు మెరిపించగల గార్టన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.

వనిందు హసరంగ(wanindu hasaranga ipl 2021)

ప్రమాణాలు బాగా పడిపోయిన శ్రీలంక జట్టులో నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లలో హసరంగ ఒకడు. వివిధ ఫార్మాట్లలో అతను నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రెండు నెలల కిందట శ్రీలంకలో ధావన్‌ నేతృత్వంలో పర్యటించిన భారత జట్టును తన స్పిన్‌తో హసరంగ బాగానే ఇబ్బంది పెట్టాడు. బ్యాటుతోనూ అతను తరచుగా విలువైన ఇన్నింగ్స్‌ ఆడుతుంటాడు. భారత్‌తో టీ20 సిరీస్‌లో అతనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ కావడం విశేషం. ఆడమ్‌ జంపా స్థానంలో ఆర్‌సీబీ హసరంగను తీసుకుంది.

దుష్మంత చమీర(dushmantha chameera ipl)

శ్రీలంక నుంచి ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకున్న మరో ఆటగాడితను. ఆర్‌సీబీ డేనియల్‌ సామ్స్‌ స్థానంలోకి ఈ ఫాస్ట్‌బౌలర్‌ను తీసుకుంది. ఐపీఎల్‌-14 తొలి దశలో కరోనా బారిన పడ్డ ఆటగాళ్లలో సామ్స్‌ ఒకడు. యూఏఈలో మిగతా మ్యాచ్‌లకు అతను అందుబాటులో లేకుండా పోయాడు. పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు నిలకడగా వికెట్లు పడగొట్టే నైపుణ్యం ఉన్న చమీర.. భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల్లో రాణించి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు. లోయరార్డర్లో అతను బ్యాటుతోనూ రాణించగలడు.

టిమ్‌ డేవిడ్‌(tim david ipl team)

సింగపూర్‌ నుంచి వచ్చిన ఓ క్రికెటర్‌ టీ20 లీగ్స్‌లో అవకాశం దక్కించుకుని మంచి పేరు సంపాదించడం అరుదైన విషయం. ఆ ఘనతను టిమ్‌ డేవిడ్‌ దక్కించుకున్నాడు. ఐపీఎల్‌ ఆడబోతున్న తొలి సింగపూర్‌ ఆటగాడు ఇతనే. బిగ్‌బాష్‌ లీగ్‌లో అతను స్టార్‌ ఆటగాడిగా ఎదిగాడు. 55 టీ20ల్లో 35.50 సగటుతో అతను 1420 పరుగులు చేశాడు. ప్రస్తుతం కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ ఆడుతున్న డేవిడ్‌.. అది ముగించుకుని ఐపీఎల్‌కు రానున్నాడు. ఫిన్‌ అలెన్‌ స్థానంలో ఆర్‌సీబీ ఈ కుర్రాడిని తీసుకుంది.

నాథన్‌ ఎలిస్‌

బిగ్‌ బాష్‌ లీగ్‌లో సత్తా చాటి ఇటీవలే ఆస్ట్రేలియా జట్టులోకి కూడా ఎంపికైన ఈ ఫాస్ట్‌బౌలర్‌కు అనుకోకుండా ఐపీఎల్‌లోనూ అవకాశం దక్కింది. తన దేశానికే చెందిన మెరిడిత్‌ పంజాబ్‌ జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలోకి ఎలిస్‌ ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌పై తన అరంగేట్ర మ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌ తీయడం ద్వారా ఎలిస్‌ ఆకట్టుకున్నాడు.

బెన్‌ డ్వార్షుయిస్‌

ఐపీఎల్‌లో అడుగు పెడుతున్న మరో ఆస్ట్రేలియా పేసర్‌.. బెన్‌ డ్వార్షుయిస్‌. ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ క్రిస్‌ వోక్స్‌ ఐపీఎల్‌-14 రెండో దశకు అందుబాటులో లేకుండా పోవడంతో దిల్లీ జట్టులో బెన్‌కు ఛాన్స్‌ వచ్చింది. బిగ్‌ బాష్‌ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ తరఫున అదరగొట్టిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ను దిల్లీ తుది జట్టులో ఆడించే అవకాశాలున్నాయి.

మార్‌క్రమ్‌

దూకుడైన బ్యాటింగ్, ఉపయుక్తమైన స్పిన్‌ బౌలింగ్‌.. టీ20 మ్యాచ్‌ల్లో బాగా ఉపయోగపడే ఈ లక్షణాలున్న దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్‌కు ఇప్పటిదాకా ఐపీఎల్‌లో అవకాశం దక్కకపోవడం ఆశ్చర్యకరమే. అయితే ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ మలన్‌ సేవలు కోల్పోయిన పంజాబ్‌.. అతణ్ని ఎంచుకుంది. టీ20ల్లో 30కి పైగా బ్యాటింగ్‌ సగటున్న మార్‌క్రమ్‌.. పార్ట్‌ టైం బౌలర్‌గానూ ఉపయోగపడతాడు. మంగళవారమే శ్రీలంకతో టీ20 సిరీస్‌ను ముగించుకున్న.. యూఏఈ విమానం ఎక్కనున్నాడు.

ఇదీ చూడండి: ఐపీఎల్ 2021: వారు వైదొలిగారు.. వీరు వచ్చారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.