ETV Bharat / sports

ధోనీ కెప్టెన్సీపై గంభీర్​ విమర్శలు

ధోనీని విమర్శించిన మాజీ క్రికెటర్ గంభీర్.. జట్టును ముందుండి నడిపించాలని అభిప్రాయపడ్డాడు. టాప్​ ఆర్డర్​లో బ్యాటింగ్​ చేసి కుర్రాళ్లకు ప్రేరణగా నిలవాలని సూచించాడు.

'You should be leading from the front': Gambhir slams Dhoni
'నాయకుడంటే జట్టును ముందుండి నడిపించాలి'
author img

By

Published : Sep 23, 2020, 1:02 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

రాజస్థాన్​​తో మంగళవారం మ్యాచ్​లో చెన్నై కెప్టెన్​ ధోనీ, ఏడో స్థానంలో బ్యాటింగ్​ చేయడమేంటని భారత మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్ ప్రశ్నించాడు​. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాలి కానీ, చివర్లో బ్యాటింగ్​కు దిగడం సరికాదని అభిప్రాయపడ్డాడు. తర్వాతి మ్యాచ్​ల్లోనైనా ముందుగా బ్యాటింగ్​కు దిగి, యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలవాలని మహీకి గంభీర్ సూచించాడు​.

"ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్​కు దిగడమా? అతడి కంటే ముందు రుతురాజ్​​, సామ్​ కరన్​లను ఎందుకు పంపాడో నాకైతే అర్థం కాలేదు. కెప్టెన్​గా ముందుండి నడిపించాలి. దీనిని అలా ఎవరూ అనుకోరు. 217 లాంటి భారీ లక్ష్యాన్ని​ ఛేదించడంలో భాగంగా ఏడో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చినా అప్పటికే ఆట దాదాపు అయిపోయింది. డుప్లెసిస్​ ఒక్కడే ఒంటరిగా పోరాటం చేశాడు. చివర్లో వచ్చి మూడు సిక్సర్లు కొట్టినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కెప్టెన్​గా చాలా పొరపాట్లు చేసినా, బహుశా ప్రజలు దీని గురించి మాట్లాడరు. ఇప్పటి నుంచైనా జట్టును ముందుండి నడిపించి ఆటగాళ్లకు ధోనీ ప్రేరణగా నిలివాలి. నాలుగు, ఐదు స్థానాల్లో లేదా డుప్లెసిస్​తో బ్యాటింగ్​ చేసి జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టాలి"

- గౌతమ్​ గంభీర్​, టీమ్ఇండియా మాజీ క్రికెటర్​

'You should be leading from the front': Gambhir slams Dhoni
రాజస్థాన్​ వర్సెస్​ చెన్నై మ్యాచ్​ సమరీ

ఈ మ్యాచ్​లో 16 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది. నిర్ణీతో ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ ఈ సీజన్‌లో తొలి విజయం అందుకుంది. ఛేదనలో డుప్లెసిస్‌(72) చెలరేగినా ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి అతడికి సహకారం అందలేదు.‌ షేన్‌ వాట్సన్‌(33), మురళీ విజయ్‌(21), సామ్‌ కరన్‌(17), కేదార్‌ జాధవ్‌(22) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. చివరి ఓవర్‌లో కెప్టెన్‌ ధోనీ(28) హ్యాట్రిక్‌ సిక్సులు బాదినా ఫలితం లేకుండా పోయింది.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.