ఈ ఐపీఎల్లో భారీ అంచనాలతో బరిలో దిగిన ఫ్రాంచైజీల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. కానీ వరుస ఓటములతో అభిమానులను నిరాశపరుస్తోంది. ఆర్సీబీ, కోల్‌కతా జట్లపై ఓటమిపాలైంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్, కమెంటేటర్ ఆకాశ్ చోప్రా. విలియమ్సన్ లేకపోవడం వల్ల, బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. అతడికి గాయాలేం కాలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు గుర్తుచేశాడు. ఫిట్‌గా ఉంటే సన్‌రైజర్స్ తరఫున వెంటనే ఆడాలని సూచించాడు.
"గాయం కారణంగా మిచెల్ మార్ష్ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో నబీని ఆడించారు. విలియమ్సన్ ఫిట్‌గానే ఉన్నాడు. గత ఇంటర్వ్యూలో తన గాయం గురించి కూడా ఎక్కడా ప్రస్థావించలేదు. కేన్ ఆరోగ్యంగా దృఢంగా ఉంటే ఎందుకు ఆడకూడదు? జట్టు బలంగా కనిపిస్తోంది. ఎలాగైనా అతడిని తీసుకొచ్చే మార్గాలను కనుక్కోవాల్సి ఉంది. విలియమ్సన్ లేకపోతే హైదరాబాద్ జట్టు 140 పరుగులకే పరిమితమవుతుంది"
ఆకాశ్ చోప్రా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
బౌలింగ్‌లోనూ హైదరాబాద్ జట్టుకు చాలా సమస్యలున్నాయని వాటిని సరిదిద్దుకోవాలని ఆకాశ్ చోప్రా చెప్పాడు. సన్‌రైజర్స్ తర్వాతి మ్యాచ్ దిల్లీ క్యాపిటల్స్‌తో(సెప్టెంబరు 29న) ఆడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.