ETV Bharat / sports

ఈసారి ఐపీఎల్​కు స్టోక్స్​ ఎందుకు దూరమయ్యాడు?

ఈ ఏడాది ఐపీఎల్​కు దూరమైన స్టార్ క్రికెటర్లలో ఆల్​రౌండర్ బెన్​స్టోక్స్ ఒకడు. రాజస్థాన్​ రాయల్స్ తరఫున ఆడే ఈ ఆటగాడు​.. లీగ్​లో ఎందుకు పాల్గొనలేకపోయాడంటే?

Ben Stokes
స్టోక్స్
author img

By

Published : Oct 1, 2020, 10:54 AM IST

ఈ ఏడాది ఐపీఎల్​లో వరుసగా రెండు విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది రాజస్థాన్​ రాయల్స్​. ఈ సారి జట్టులో సంజూ శాంసన్​, రాహుల్​ తెవాతియా లాంటి యువ ఆటగాళ్లు దూకుడైన ప్రదర్శనతో రెచ్చిపోతున్నారు. మరోవైపు జోఫ్రా ఆర్చర్​ బ్యాటింగ్, బౌలింగ్​లో ఆశ్చర్యపరుస్తున్నాడు. బ్యాటింగ్​ లైనప్​లో రాజస్థాన్​ బలంగా కనిపిస్తోంది. అయితే, ఈ సీజన్​లో ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్ లేకపోవడం అభిమానులకు కాస్త నిరాశ కలిగిస్తోంది. యూఏఈ స్టేడియాల్లో స్టోక్స్​కు చాలా మ్యాచులు ఆడిన అనుభవం ఉంటడమే ఇందుకు కారణం.

గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్​ను ఇంగ్లాండ్​ గెలుచుకోవడంలో స్టోక్స్ కీలకపాత్ర పోషించాడు. అదే ఏడాది యాషెస్​ సిరీస్​లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈసారి ఐపీఎల్​కు అందుబాటులో లేకుండా పోయాడు. బ్రెయిన్​ క్యాన్సర్​తో బాధపడుతున్న తన తండ్రిని కలిసేందుకు న్యూజిలాండ్​ వెళ్లాడు​. అందుకే లీగ్​లో బాగం కాలేకపోయాడు. ఒకవేళ అన్నీ కుదిరితే అక్టోబరులో యూఏఈ చేరుకుని.. రాజస్థాన్ తరఫున స్టోక్స్ ఆడే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.