ETV Bharat / sports

ఆర్సీబీది మళ్లీ పాత కథే.. 'ఈ సాలా' ఏమైంది?

author img

By

Published : Nov 7, 2020, 3:03 PM IST

ఐపీఎల్ ట్రోఫీ గెలవాలన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోరిక ఈ ఏడాది కూడా కలగానే మిగిలిపోయింది. కాకపోతే ఎప్పుడూ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టే కోహ్లీసేన.. ఈ సారి ప్లేఆఫ్స్​కు వచ్చి ఓటమి పాలవడం అభిమానులను బాధించింది. ఇంతకీ ఈ సీజన్​లో ఆర్సీబీ వైఫల్యానికి కారణాలేంటంటే?

What were the main factors behind Royal Challengers Bangalore's exit from IPL 2020?
ఆర్సీబీది మళ్లీ పాత కథే.. ఈసారి అసలు ఏమైంది?

'ఈ సాలా కప్ నమదే'.​. కోహ్లీ అభిమానులకు, ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులకు బాగా తెలిసిన, నచ్చిన ఏకైక పదం. ఐపీఎల్​లో ఇది నిజం కావాలని 12 సీజన్ల నుంచి వాళ్లు ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ అది కలలానే మిగిలిపోయింది. ఈ సీజన్​లోనైనా అది జరుగుతుందనుకున్నారు. ఎలిమినేటర్​ మ్యాచ్​లో హైదరాబాద్​పై ఓటమితో అది కాస్త 'నెక్స్ట్ సాలా కప్ నమదే'గా మారిపోయింది. ఈసారి సమతూకంతో కనిపించిన బెంగళూరు.. కనీసం ఫైనల్​కు అయినా ఎందుకు వెళ్లలేకపోయింది. వారి వైఫల్యానికి కారణలేంటి? ఎక్కడ తేడా కొట్టింది?

కరోనా కారణంగా మార్చిలో జరగాల్సిన ఐపీఎల్.. కొన్ని నెలలు వాయిదా వేసి, సెప్టెంబరు నుంచి యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈసారి విజేతగా నిలిచేందుకు బెంగళూరుకు ఎక్కువగా అవకాశాలున్నాయని అభిమానులతో పాటు మాజీలు అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్లే లాక్​డౌన్​తో విరామం దొరకడం వల్ల ఈ జట్టులోని బ్యాట్స్​మెన్, బౌలర్లు చెలరేగుతారని భావించారు. దానినే నిజం చేస్తూ తొలి 10 మ్యాచ్​ల్లో ఏడింటిలో గెలిచి, టాప్-2లో నిలిచింది ఆర్సీబీ.

rcb
బెంగళూరు జట్టు

జోరు తగ్గింది

సరిగ్గా అప్పుడే ఏదో జరిగినట్లు పరిస్థితులు మారిపోయాయి.​ మరో మ్యాచ్​ గెలిస్తే ప్లేఆఫ్స్​లో అడుగుపెడుతుంది అనుకున్న బెంగళూరు.. వరుసగా చెన్నై, ముంబయి, హైదరాబాద్​లపై ఓడిపోయింది. అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. చివరి లీగ్ మ్యాచ్​లోనూ తక్కువ తేడాతో దిల్లీ చేతిలో ఓటమితో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. నాలుగు మ్యాచ్​ల్లో ఓడినా సరే ప్లేఆఫ్స్​లో అడుగుపెట్టింది.

ప్లేఆఫ్స్​లో అయినా సరే బాగా ఆడుతుందేమోనని అభిమానులు ఎదురుచూశారు. కానీ గత వైఫల్యాన్నే కొనసాగిస్తూ ఎలిమినేటర్​ మ్యాచ్​లో హైదరాబాద్​ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కప్పు కోసం మరో ఏడాది ఎదురు చూసేలా చేసుకుంది.

డెత్ ఓవర్లలో ఆర్సీబీ ప్చ్..

ప్రారంభంలో బాగానే ఆడిన ఆర్సీబీ.. లీగ్ చివరి దశలోని మ్యాచ్​ల డెత్​ ఓవర్లలో(16-20 ఓవర్ల మధ్య) పూర్తిగా నిరాశపరిచింది. చెన్నైతో మ్యాచ్​లో 44 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ముంబయిపై 35 పరుగులు చేసి నాలుగు వికెట్లు పోగొట్టుకుంది. హైదరాబాద్​పై అయితే మరీ దారుణంగా 27 పరుగులు చేసి మూడు వికెట్లు సమర్పించుకుంది. దిల్లీతో మ్యాచ్​లో కొంచెం మెరుగ్గా బ్యాటింగ్ చేసి 49 పరుగులు చేసింది, కానీ ఐదు వికెట్లు పోయాయి. ఎలిమినేటర్​లోనూ 38 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.

kohli
కెప్టెన్ కోహ్లీ

అయితే డెత్ ఓవర్లలో ఆర్సీబీ బ్యాటింగ్ సగటు 7.7 మాత్రమే. ప్లేఆఫ్స్ అర్హత సాధించిన ఇతర జట్లతో పోలిస్తే ఇది తక్కువే! అదే ముంబయిని చూసుకుంటే 10కి పైగా రన్​రేట్​తో ఉంది.

కోహ్లీ వైఫల్యం, తప్పుడు నిర్ణయాలు

వరుసగా ఆఖరి ఐదు మ్యాచ్​ల్లో ఓడి టోర్నీ నుంచి బెంగళూరు నిష్క్రమించే సరికి అందరి దృష్టి కోహ్లీ బ్యాటింగ్​పై పడింది. చెన్నైపై 116 స్ట్రైక్​రేట్​తో అర్ధశతకం చేసిన కోహ్లీ.. ఆ తర్వాతి మ్యాచ్​ల్లో 9, 7, 29, 6 పరుగులు చేశాడు. మొత్తంగా చూసుకుంటే 20.2 సరాసరితో 101 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

అలానే ఎలిమినేటర్​ మ్యాచ్​లోనూ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్​ ఓటమికి కారణమయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. కీలకమైన పోరుకు ముందు ఆల్​రౌండర్​ మోరిస్ అందుబాటులో లేకపోవడం.. ఉదానా స్థానంలో జట్టులోకి వచ్చిన మొయిన్ అలీ.. అనుహ్యంగా ఫ్రీహిట్​ బంతికి రనౌట్ కావడం.. శివమ్ దూబే, అలీకి చెరో ఓవర్ మాత్రమే ఇవ్వడం.. లాంటి ఆంశాలు కోహ్లీని విమర్శించే వారికి ఊతమిచ్చినట్లయింది. పిచ్​ను చక్కగా సద్వినియోగం చేసుకునే మొయిన్ అలీతో ఓవర్ల కోటా పూర్తి చేయిస్తే బాగుండేదని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

kohli
ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ

నాలుగు మార్పులు

కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌కు కోహ్లీ తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేశాడు. అందులో ముగ్గురు విదేశీయులు కావడం విశేషం. ఫిలిప్, ఉదానా, మోరిస్‌, షాబాజ్‌లను తప్పించి ఫించ్‌, మొయిన్‌ అలీ, జంపా, సైనీలను తుది జట్టులోకి తెచ్చాడు. అలా మార్పులు చేయడం కూడా ఓటమిరకి ఓ కారణమని అభిమానులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.