ETV Bharat / sports

డుప్లెసిస్ డ్రింక్స్ మోయడం చూడలేకపోయాను!

అశ్విన్​తో జరిగిన యూట్యూబ్​ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు స్పిన్నర్ తాహిర్. గతడేది ఐపీఎల్​లో డుప్లెసిస్ డ్రింక్స్ ఇస్తుంటే చూడలేకపోయానని అన్నాడు.

Was painful to see Faf du Plessis carry drinks, I'm doing that this year: Imran Tahir
'డుప్లెసిస్​ చేసిన పనే నేనూ చేస్తున్నా..'
author img

By

Published : Oct 23, 2020, 1:30 PM IST

గతేడాది ఐపీఎల్​లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్​ క్యాప్​ అందుకున్న చెన్నై సూపర్​ కింగ్స్​ స్పిన్నర్​ ఇమ్రాన్​ తాహిర్​.. ఈసారి మాత్రం బెంచ్​కే పరిమితమయ్యాడు. డ్రింక్స్ బాయ్​గా మారి, సహచర ఆటగాళ్లకు కూల్​డ్రింక్స్​ ఇస్తున్నాడు. మరి ఈ సీజన్​లో ఆడే అవకాశం వస్తుందా? అన్న ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానమిచ్చాడు​.

"నాకు దాని గురించి తెలియదు. గతేడాది మొత్తం డుప్లెసిస్​ ఆటగాళ్లకు కూల్​డ్రింక్స్​ ఇచ్చాడు. అది చూసి చాలా బాధేసింది. ఇప్పడు నేను అదే చేస్తున్నాను. గతంలో నేను ఆడేటప్పుడు చాలామంది ఆటగాళ్లు నాకు కూల్​డ్రింక్స్​ అందించేవారు. ఆ పని ఇప్పుడు నేను చేయటం బాధ్యతగా భావిస్తున్నాను. మా జట్టు గెలవటమే నాకు ముఖ్యం. అవకాశం వస్తే మంచి ప్రదర్శన చేస్తాను"

-ఇమ్రాన్​ తాహిర్​ , చెన్నై స్పిన్నర్

ఇప్పటికే ఫ్లేఆఫ్స్ నుంచి దాదాపు తప్పుకున్న చెన్నై సూపర్​కింగ్స్.. శుక్రవారం రాత్రి ఏడున్నరకు ముంబయితో తలపడనుంది. షార్జా వేదికగా ఈ మ్యాచ్​ జరుగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.